బాలయ్య- బోయపాటి కలయికలో ‘అఖండ 2′(Akhanda 2) రూపొందింది. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి డిసెంబర్ 4 నుండే ప్రీమియర్ షోలు వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అవి క్యాన్సిల్ అయ్యాయి. అయినప్పటికీ ‘అఖండ 2’ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘అఖండ 2’ పై ఆసక్తి పెంచే అంశాలు ఏంటో.. ఈ సినిమాని ఆడియన్స్ కచ్చితంగా థియేటర్లలో ఎందుకు చూడాలనుకుంటున్నారో? వాటికి కారణాలేంటో తెలుసుకుందాం రండి :
1)నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తిరుగులేని కాంబినేషన్ అని ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులు, ముఖ్యంగా బాలయ్య అభిమానులు కూడా భావిస్తుంటారు. ఈ కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. అన్ని సినిమాలు కూడా ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టు హిట్ అయ్యాయి. అందుకే ‘అఖండ 2’ కి ఫస్ట్ హైలెట్ పాయింట్ అంటే కాంబినేషన్ క్రేజ్ అనే చెప్పాలి.

2)2021 లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ ‘అఖండ’ రిలీజ్ అయ్యింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ భయపడుతున్న టైం అది. పెద్ద సినిమాలకు అవసరమైన టికెట్ హైక్స్, అదనపు షోలు వంటి వాటికి అప్పటి ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. అలాంటి టైంలో ‘అఖండ’ ముందడుగు వేసింది. కంటెంట్ తోనే ఈ సినిమా దాని స్థాయి పెంచుకుంది. ఇలాంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా వస్తుండటం కూడా ‘అఖండ 2’ కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

3)’అఖండ’ సినిమాలో ‘అఘోర’ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. మొదటి భాగంలో ‘అఘోర’ పాత్ర ఎంటర్ అయినప్పటి నుండి థియేటర్లలో మాస్ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఆ పాత్రని దర్శకుడు బాగా హైలెట్ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో పరమశివుడి రిఫరెన్స్ అయితే అందరినీ ట్రాన్స్ కి గురిచేసింది. ‘అఖండ 2’ కి ఆ పాత్ర మెయిన్ కాబట్టి.. ఇదొక స్పెషల్ అట్రాక్షన్.

4)మొదటి భాగం క్లైమాక్స్ లో అఘోర పాత్ర పాపకి ప్రామిస్ చేస్తుంది. దాన్ని సెకండ్ పార్ట్ లో ఎలా ఎలివేట్ చేస్తారు అనేది కూడా ఆసక్తికర అంశం.
5)ఈ సినిమాలో బాలయ్య కూతురిగా హర్షాలీ మల్హోత్రా నటించింది. 2015 లో వచ్చిన బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘భజరంగి భాయిజాన్’ లో మున్ని పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. ఇప్పుడు పెద్దదైంది. ఈ సినిమాలో ఎలా నటించిందో చూడాలి. ఏదేమైనా హర్షాలీ కూడా ‘అఖండ 2’ కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
6)’అఖండ 2′ మరో స్పెషల్ అట్రాక్షన్ అంటే ఆది పినిశెట్టి విలన్ గా నటించడం. ‘సరైనోడు’ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఇతను మళ్ళీ ‘అఖండ 2’ చేశాడు. ఈ సినిమాలో అతని మేకోవర్ చాలా వైవిధ్యంగా ఉంది. యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో..!

7)సంయుక్త మీనన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేసింది. సాంగ్లో డాన్స్ చేసినప్పటికీ.. ఆమెది హీరోయిన్ రోల్ కాదు అంటున్నారు.సంయుక్త కూడా ఎటువంటి స్పెషాలిటీ లేకపోతే పాత్రని యాక్సెప్ట్ చేయదు.

8) రామ్ లక్ష్మణ్ ఫైట్స్.. బోయపాటి సినిమాలకి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువగానే ఉంటుంది. బాలకృష్ణ హీరో అనేసరికి వీళ్ళు మరింత ఉత్సాహంగా ఫైట్స్ కంపోజ్ చేస్తుంటారు. ‘అఖండ 2’ వంటి పాన్ ఇండియా సినిమాకి వీళ్ళ ఫైట్స్ కూడా హైలెట్ అయ్యే అవకాశం ఉంది.
9) ఎస్.ఎస్.తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కూడా ‘అఖండ 2’ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ‘అఖండ’ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. కాబట్టి ఈసారి కూడా స్పీకర్స్ బద్దలుగొడతాడేమో చూడాలి.

10)’అఖండ 2′ లో సనాతన ధర్మం కాన్సెప్ట్. పరమశివుని రిఫరెన్స్ పాయింట్స్ కూడా టీజర్, ట్రైలర్స్ లో హైలెట్ చేశారు. అవి కనుక వర్కౌట్ అయితే నార్త్ లో కూడా సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం. ‘మహాకుంభమేళా’ లో కూడా కొన్ని సీన్స్ తీశారు. అవి ఉంటాయో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.
