టాలీవుడ్ లో ‘గోల్డెన్ లెగ్’ ఇమేజ్ తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు ఓ రికార్డ్ కి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతున్న ‘అఖండ 2’ సినిమా ఫలితం ఆమెకు చాలా కీలకం. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న ఈ మాస్ బొమ్మ గనక హిట్ అయితే, సంయుక్త ఖాతాలో కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, ఒక అరుదైన రికార్డు కూడా వచ్చి చేరనుంది. నందమూరి అభిమానులకు ఆమె లక్కీ చార్మ్ గా మారిపోనుంది.
AKHANDA 2
గతంలో సంయుక్త నందమూరి కళ్యాణ్ రామ్ తో జతకట్టింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘బింబిసార’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఆ సినిమాతో నందమూరి మూడో తరం హీరోకి ఒక సాలిడ్ హిట్ ఇచ్చిన ఘనత ఆమెకు దక్కింది. ఆ తర్వాత ‘డెవిల్’ చేసినా, బింబిసార ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. ఇప్పుడు సీన్ బాబాయ్ వైపు మళ్లింది.
అబ్బాయితో హిట్ కొట్టిన సంయుక్త, ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణతో ‘అఖండ 2’లో నటిస్తోంది. ఈ సినిమా గనక విజయం సాధిస్తే, ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల హీరోలతో (బాబాయ్ అబ్బాయ్) బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోయిన్ల జాబితాలో ఆమె చేరిపోతుంది. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది కథానాయికలకు మాత్రమే ఇలాంటి ఛాన్స్ దొరుకుతుంది. ఆ రేర్ ఫీట్ ఇప్పుడు సంయుక్త తలుపు తడుతోంది.
ఇక సినిమాలో ఆమె పాత్ర విషయానికి వస్తే, మొదటి భాగంలో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ గా మెప్పించింది. సీక్వెల్ లో సంయుక్త పాత్ర అంతకంటే బలంగా, కథను డ్రైవ్ చేసేలా ఉంటుందట. కేవలం పాటలకు, గ్లామర్ కు పరిమితం కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కడం ఆమె అదృష్టం. ‘విరూపాక్ష’, ‘సార్’ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఇందులోనూ తన మార్క్ చూపిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
