భారత యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ తో మరాఠీ నటి సయాలీ సంజీవ్ డేటింగ్ చేస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. క్రికెటర్ గా రుతురాజ్ కి మంచి పేరుంది. అతడి కెప్టెన్సీ, బ్యాటింగ్ ను చాలా మంది ఇష్టపడుతుంటారు. త్వరలోనే అతడు భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మరోపక్క మరాఠీ నటి సయాలీ సంజీవ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో రుతురాజ్ గైక్వాడ్‌తో డేటింగ్ రూమర్స్ రావడంతో
అవి తనపై తన కుటుంబంపై చాలా ప్రభావం చూపిస్తున్నాయని చెప్పుకొచ్చింది. రుతురాజ్ గైక్వాడ్‌తో తనకు మంచి స్నేహం ఉండేదని.. ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ ట్రాక్ లేదని చెప్పింది. ఈ రూమర్స్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపింది. రుతురాజ్ గైక్వాడ్ టాలెంటెడ్ క్రికెటర్ అని.. తామిద్దరం ఎప్పుడూ కెరీర్ గురించే మాట్లాడుకునేవాళ్లమని గుర్తుచేసుకుంది. మొదట్లో ఈ రూమర్స్ ను పెద్దగా పట్టించుకోలేదని.. కానీ ఆ రూమర్స్ తీవ్రత పెరిగిపోవడంతో తమ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేది.
ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహం కూడా లేదని.. అతడు సెంచరీ సాధించినప్పుడు కంగ్రాట్స్ కూడా చెప్పలేకపోతున్నానని వెల్లడించింది. అతడి పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పుకొచ్చింది. హీరోయిన్లు.. క్రికెటర్స్ ను డేటింగ్ చేయడం చాలా కాలంగా జరుగుతుంది. కొందరు పెళ్లిళ్ల వరకు వస్తే మరికొందరు మధ్యలోనే విడిపోయారు. సయాలీ సంజీవ్ మాత్రం తనకు రుతురాజ్ తో ఎలాంటి ఎఫైర్ లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడితోనైనా.. ఈ వార్తలకు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి!