రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమా పీరియాడిక్ మూవీ రూపొందింది. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్ర పోషించారు. మహేష్ బాబు పి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు.
వారి సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక టీజర్, ట్రైలర్స్ వంటివి వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది.

ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
| నైజాం | 8.5 cr |
| సీడెడ్ | 2.5 cr |
| ఆంధ్ర(టోటల్) | 9 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 20 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.8 cr |
| ఓవర్సీస్ | 3.2 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 25 కోట్లు(షేర్) |
‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka) చిత్రానికి రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.25.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చూడాలి మరి ఆ అవకాశాన్ని ఎంత వరకు వాడుకుంటుందో
