రామ్ హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమా రూపొందింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా నేడు అంటే నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? తొలి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉండొచ్చు? వంటి అంశాల పై చర్చలు గట్టిగా నడుస్తున్నాయి.
అందుతున్న ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు మార్నింగ్ షోలు డల్ గా ఉన్నప్పటికీ.. సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ రావడం వల్ల మ్యాట్నీలకి ఆక్యుపెన్సీ పెరిగింది. ఈవెనింగ్ అండ్ నైట్ షోలకి కూడా మరింతగా ఆక్యుపెన్సీలు పెరిగాయి అని చెప్పొచ్చు. ఇవి ఆన్లైన్ బుకింగ్స్ ట్రాకింగ్ మేరకు చెబుతున్న అనాలసిస్. ఆఫ్ లైన్ బుకింగ్స్ వంటివి ఎలా ఉన్నాయనేది మొదటి రోజు ఓపెనింగ్స్ ను బట్టి చెప్పొచ్చు.

ఆ రకంగా చూస్తే ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు రూ.6.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.25.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. సో మొదటి రోజు 25 శాతం పైనే రికవరీ సాధించే అవకాశం ఉందన్న మాట. ఇక రెండో రోజుకి థియేటర్స్ పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అలా అయితే సినిమా వీకెండ్ కి ఈజీగా 80 శాతం రికవరీ సాధించే ఛాన్స్ ఉంటుంది.
