గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా , జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్నవిలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్రం పై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మద్యే రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 27, 2026న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ, శివరాజ్‌కుమార్, జగపతి బాబు వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలలో నటిస్తూ ఈ సినిమా పాన్-ఇండియా స్కేల్‌లో మేకింగ్ జరుపుకుంటుంది.
ఇక తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జాన్వీ కపూర్ పోషిస్తున్న ‘అచ్చియమ్మ’ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో ఆమె బాడీ డబుల్‌గా ‘మసూద’ ఫేమ్ బంధవి శ్రీధర్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇద్దరి హైట్, బాడీ లాంగ్వేజ్ దగ్గరగా ఉండటంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ముఖ్యంగా రిస్కీ షాట్స్, బ్యాక్ మరియు వైడ్ యాంగిల్స్‌లో బంధవి కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

శ్రీలంక, పూణే, హైదరాబాద్‌ల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన ‘పెద్ది’ టీమ్ ప్రస్తుతం భారీ యాక్షన్ బ్లాక్స్‌ను షూట్ చేస్తోంది. ఈ డూప్ వార్త బయటకు రావడంతో అభిమానులు అధికారిక స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
