ఇటీవల తన మూడో భర్తకు కూడా విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి హాట్ టాపిక్‌గా మారింది ఓ నటి. ఆమె మరెవరో కాదు.. ’13B’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మీరా వాసుదేవన్. అవును ఇటీవల ఆమె తన మూడో భర్తకు కూడా విడాకులు ప్రకటించి అందరికీ షాకిచ్చింది.’అందరికీ నమస్కారం, నేను మీ మీరా వాసుదేవన్. ఈ ఏడాది ఆగస్టు నుంచి నేను సింగిల్‌గా ఉంటున్నాను.
నా లైఫ్‌లో ఇదే అత్యంత అద్భుతమైన, ప్రశాంతమైన దశ అని నేను భావిస్తున్నాను” అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. #focused, #blessed, #gratitude వంటి హ్యాష్‌ట్యాగ్స్‌ను కూడా జత చేసింది. దీంతో ఆమె మూడో పెళ్లి కూడా పెటాకులైనట్లు అంతా చెప్పుకుంటున్నారు.43 ఏళ్ల మీరా వాసుదేవన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఆమె ప్రయాణం చూస్తే 2005లో విశాల్ అగర్వాల్ అనే వ్యక్తిని మొదటి పెళ్లి చేసుకున్న మీరా, ఐదేళ్ల తర్వాత 2010లో మనస్పర్థలతో విడిపోయింది.

ఆ తర్వాత రెండేళ్లకు, 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. KGF, సార్పట్ట వంటి సినిమాలతో జాన్ తెలుగు ఆడియన్స్‌కు బాగా తెలుసు. ఈ జంటకు అరిహా అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే నాలుగేళ్లకే, 2016లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.గతేడాది అంటే 2023లో సినిమాటోగ్రాఫర్ విపిన్‌ను మీరా పెళ్లి చేసుకుంది. కనీసం ఈ మూడో పెళ్లి బంధమైనా నిలుస్తుందనుకుంటే, ఏడాది తిరిగేలోపే విడిపోయారు.
మీరా వాసుదేవన్ తన కెరీర్‌ను ప్రారంభించింది తెలుగు సినిమాతోనే. 2003లో జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన గోల్ మాల్ ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఎదిగింది. సినిమాలతో పాటు ‘కుటుంబవిళక్కు’ వంటి టీవీ సీరియల్స్‌తోనూ ఆమె భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు మూడు పెళ్లిళ్లు విఫలమైనా, తాను సింగిల్‌గా ఎంతో ప్రశాంతంగా ఉన్నానంటూ ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
