Trivikram: త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్యాన్ ఇండియా స్టార్ అయిన హీరోయిన్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్కూల్ నుంచి బయటకి వచ్చిన హీరోయిన్స్ కి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుంది. సమంతా, పూజా హెగ్దేలే అందుకు ఉదాహరణ. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈరోజు పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే త్రివిక్రమ్ పుణ్యమే. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో నటించిన తర్వాత సమంతా రేంజ్ మారిపోయింది, ఇక అ-ఆ సినిమాతో సామ్ క్రేజ్ వేరే లెవల్ కి వెళ్లిపోయింది. ఈ సినిమాల వెనక ఉన్నది త్రివిక్రమ్ కలమే. పూజా హెగ్దే కూడా ఇంతే.

ఎన్టీఆర్ తో అరవింద సమేత, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో, ఇప్పుడు SSMB 28 సినిమాతో మహేశ్ బాబు పక్కన పూజా హెగ్దే నటిస్తోంది. ఈ సినిమాలు పూజా హెగ్దేని స్టార్ ని చేశాయి. తన హీరోయిన్స్ ని రిపీట్ చేసే అలవాటు ఉన్న త్రివిక్రమ్, ఒక హీరోయిన్ ని ఎంచుకుంటే ఆమె స్టార్ అయ్యే వరకూ అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఇలియానాని కూడా త్రివిక్రమ్ బాగానే సపోర్ట్ చేశాడు కానీ గోవ బ్యూటీ బాలీవుడ్ పై మనసు పారేసుకోని ఇక్కడ అవకాశాలని మిస్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ లిస్టులో కొత్తగా చేరింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్.

సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసినా… త్రివిక్రమ్ (Trivikram) రచనా సహకారం అందించిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకి భార్య క్యారెక్టర్ లో నటించిన సంయుక్త మీనన్ కి తెలుగులో మంచి డెబ్యు దొరికింది. సంయుక్త మీనన్ క్యారెక్టర్ ఒరిజినల్ మలయాళ సినిమా కంటే భీమ్లా నాయక్ లో కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త మీనన్, ఆ తర్వాత త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లాంటి సితారా ఎంటర్టైన్మెంట్స్ తో రెండో సినిమా చేసింది. ధనుష్ హీరోగా నటించిన బైలింగ్వల్ సినిమా ‘సార్’ మూవీతో సంయుక్త మీనన్ ని మరింత క్రేజ్ వచ్చింది.

మాస్టారు మాస్టారు సాంగ్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో సంయుక్త మీనన్ ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అలా సమంతా, పూజా హెగ్దేల తర్వాత టాలీవుడ్ కి మరో మంచి హీరోయిన్ ని ఇచ్చాడు త్రివిక్రమ్. ఇప్పటికే భీమ్లా నాయక్, బింబిసారా, సార్, సినిమాతో సాలిడ్ హిట్స్ అందుకున్న సంయుక్త మీనన్ లేటెస్ట్ గా విరుపాక్ష సినిమాలో నటించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

విరుపాక్ష మూవీలో సంయుక్త మీనన్ యాక్టింగ్ చూసిన వాళ్లు, త్రివిక్రమ్ ఇంట్రడ్యూస్ చేసిన టాలెంట్ కి కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు. సంయుక్త మీనన్ విరుపాక్ష సినిమాతో ఒక నటిగా చాలా మంచి పేరు తెచ్చుకుంది. మరి ఫ్యూచర్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోల పక్కన సంయుక్త నటిస్తుందా? త్రివిక్రమ్ కి ఫ్యూచర్ లో ఈ హీరోలతో లైనప్ ఉంది కాబట్టి సంయుక్తని రిఫర్ చేస్తాడా అనేది చూడాలి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus