Hamsa Nandini: కీమోని జయించింది.. హంసానందిని లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

‘బిగ్ బాస్2’ విన్నర్ కౌశల్ హీరోగా వచ్చిన ‘ఒకటవుదాం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హంసా నందిని. ఆ తరువాత ‘786’ అనే చిత్రంలో కూడా నటించింది. కానీ ఇవి ప్రేక్షకులకు తెలిసుండకపోవచ్చు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అనుమానాస్పదం’ చిత్రమే హంసానందిని మొదటి చిత్రం అనుకుంటారంతా.! అటు తరువాత ‘అధినేత’ ‘ఆహా నా పెళ్లంట’ వంటి చిత్రాల్లో కూడా నటించి పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. కానీ హీరోయిన్ గా మాత్రం ఈమె రాణించలేకపోయింది.

Click Here To Watch

స్పెషల్ సాంగ్ లు, గెస్ట్ రోల్స్ కు మాత్రమే పరిమితమవుతూ సినిమాల్లో మెరుస్తుంది. ‘ఈగ’ ‘మిర్చి’ ‘ అత్తారింటికి దారేది’ ‘లౌక్యం’ ‘జై లవ కుశ’ వంటి చిత్రాల్లో నటించి ఈమె గ్లామర్ తో అందరినీ కట్టిపడేసింది. సోషల్ మీడియాలో కూడా ఈమె ప్రేక్షకులకి నిరంతరం హాట్ ట్రీట్ ఇచ్చేది. కానీ ఇటీవల ఈమె క్యాన్సర్ భారిన పడడంతో అంతా షాక్ అయ్యారు. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్ కు గురైంది…

కానీ ఏమాత్రం కుంగిపోకుండా దానితో పోరాడి గెలిచే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా ఈమె కొత్త ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ ధైర్యంగానే ఉన్నట్టు తెలిపింది.ఆమెకి క్యాన్సర్ పూర్తిగా తగ్గలేదు కానీ కీమో నుంచి బయటపడినట్టు క్లారిటీ ఇచ్చింది. ఇక ఆమెకి కీమో థెరపీ అవసరం లేదట. మందులు వాడితే సరిపోతుందన్న మాట. చాలా మంది హీరోయిన్లు క్యాన్సర్ కు గురైనప్పటికీ… ధైర్యంగా తట్టుకుని నిలబడి కోలుకున్నారు. సోనాలి బింద్రే వంటి నటీమణులు ఎంతో మంది ఈ లిస్ట్ లో ఉన్నారు.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus