Actress Hari Priya: కాబోయే భర్త తో సెట్లో హరిప్రియ సందడి.. వీడియో వైరల్..!
- December 10, 2022 / 04:05 PM ISTByFilmy Focus
నటి హరిప్రియ.. నటుడు వశిష్ట ఎన్. సింహాతో ఏడడుగులు వెయ్యడానికి రెడీ అయిపోయింది.. శనివారం (డిసెంబర్ 3) వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాబోయే వధూవరులను బ్లెస్ చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ దుబాయ్‌లో తీసుకున్న పిక్ షేర్ చేశారు.. పెళ్లి షాపింగ్ కోసం ఈ యంగ్ కపుల్ దుబాయ్ వెళ్లారు.. ఇటీవల ఓ కుక్క పిల్ల కారణంగా తమ ప్రేమకథ స్టార్ట్ అయిందని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచింది హరిప్రియ..
ఇప్పుడు కాబోయే భర్త నటిస్తున్న ‘లవ్ లీ’ మూవీ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి అక్కడ కాసేపు సందడి చేసింది.. ప్రముఖ కమెడియన్ సాధు కోకిల, ‘కేజీఎఫ్’ ఫేమ్ మాళవికా అవినాష్ కూడా ఆమెతో సరదాగా గడిపారు.. వీడియో చూసిన వారంతా శ్రీ సింహా, హరిప్రియల కెమిస్ట్రీ బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. కాగా.. న్నడలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హరిప్రియ.. హీరోయిన్ భూమిక నిర్మించిన ‘తకిట తకిట’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది..
‘పిల్ల జమీందార్’, ‘అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, బాలయ్య ‘జై సింహా’ చిత్రాలతో ఆకట్టుకుంది. మలయాళంలోనూ నటించింది. ‘కె.జి.యఫ్’ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్రదర్ కమల్ క్యారెక్టర్ చేశాడు. తెలుగులో వెెంకటేష ‘నారప్ప’ లోనూ నటించాడు..
..@HariPrriya6 visit the sets of @ImSimhaa #LoveLi The film directed by #ChethanKeshav is currently going on in #Udupi pic.twitter.com/2IpanfQO31
— A Sharadhaa (@sharadasrinidhi) December 10, 2022
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!












