Hema Malini: ఎక్కడో లెక్కలు తప్పాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హేమమాలిని!

నటి హేమమాలిని ధర్మేంద్ర వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె తన భర్తకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఇలా భర్తకు దూరంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన భర్తకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనే విషయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హేమాలిని యాంకర్ ప్రశ్నిస్తూ ఆమెని ఫెమినిస్ట్ ఐకాన్ గా పరిగణిస్తూ..

మీరు ఒంటరిగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు హేమాలిని సమాధానం చెబుతూ..నేను శ్రీ వాదానికి చిహ్నమా… ఏ స్త్రీ కూడా తన భర్తకు దూరంగా ఉండాలని కోరుకోదు. జీవితం ఏదిస్తుందో అదే జరుగుతుందని, దానిని మనం స్వీకరించాలని ఈమె తెలిపారు. ప్రతి ఒక్క స్త్రీ తన భర్త పిల్లలతో పాటు ఉండాలని కోరుకుంటారు. ఎక్కడో వారి లెక్కలు తప్పుతాయి లేకపోతే ఎవరికీ తమ జీవితాన్ని ఇలా గడపాలని అనుకోరు అంటూ ఈమె తన భర్త నుంచి దూరంగా ఉండటానికి కొన్ని విభేదాలే కారణమని పరోక్షంగా తెలియజేశారు.

ఇక  నా భర్తకు దూరంగా ఉన్నప్పటికీ నేను ఏమి బాధపడలేదని ప్రస్తుతం నాతో నా ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను వారితో సంతోషంగా ఉన్నానని హేమమాలిని తెలిపారు. నేను నా పిల్లలను చాలా బాగా పెంచానని ఈమె తెలియజేశారు.ఇక ధర్మేంద్ర ఎప్పుడు తన పెద్ద భార్య వద్ద ఉండేవారని అయితే ఆయన ఎక్కడ ఉన్న పిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేయాలని కంగారు పడేవారు

అయితే మన జీవితంలో ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది భగవంతుడు దయవల్ల నా ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు జరిగిపోయి వారు నేను అనుకున్న విధంగానే సంతోషంగా గడుపుతున్నారు అంటూ ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి (Hema Malini) హేమమాలిని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus