కారు, ఇల్లు ఎవరో కొనిచ్చారా..? నా సంపాదన ఎంతో తెలుసా..?

సీరియల్స్, సినిమాల్లో నటించిన హిమజ.. కొన్ని టీవీ షోలు కూడా చేసింది. బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని కాస్త పాపులారిటీ దక్కించుకుంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ సొంత ఇల్లు, లగ్జరీ కారు కొనుక్కుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమెపై రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇల్లు, కారు ఎవరో కొనిచ్చి ఉంటారనే మాటలు వినిపించాయి. దీంతో మండిపడ్డ హిమజ.. ఘాటుగా స్పందించింది.

తను పలు సీరియల్స్ లో నటించడంతో పాటు.. సినిమాల్లో కూడా చేస్తున్నట్లు చెప్పింది. బిగ్ బాస్ షోలో ఎంత కష్టపడ్డామో అందరూ చూసారని.. ఇవన్నీ చేస్తున్నామంటే డబ్బు సంపాదిస్తున్నామనే కదా అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకండా తను హెర్బల్ కంపెనీకి సూపర్ వైజర్ గా పని చేస్తున్నట్లు.. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేంత డబ్బు తన దగ్గర ఉందని.. ఇవేవీ తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడింది.

ఇండస్ట్రీలో పని చేసేవారికి లోన్లు ఇవ్వరా..? మేం కార్లు, ఇల్లు కొనుక్కోలేమా..? అంటూ ప్రశ్నించింది. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తరువాత 15 షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్లినట్లు చెప్పింది హిమజ. అదొక్కటి చాలు కదా కారు కొనుక్కోవడానికి అంటూ చెప్పుకొచ్చింది. తను ఇల్లు తల్లితండ్రుల సహాయంతో కొన్నట్లు.. వాళ్ల కొంత డబ్బుని ఎరేంజ్ చేశారని.. అలాంటిది ఎవడో కొనిచ్చాడనే మాటలు వింటే వాళ్లకి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus