ఈ మధ్య కాలంలో చాలా మంది సినిమా వాళ్ళు మరణించారు. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్, హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్, తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, వైభవ్ కుమార్ సింగ్, షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో, సీనియర్ నటి విజయ భాను, నటి, మోడల్ అయిన షెఫాలీ జరీవాలా, దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి వంటి ఎంతో మంది నటీనటులు కన్నుమూశారు..
ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకముందే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తానీ నటి అయిన హుమైరా అస్గర్ అలీ మరణించారు. కరాచీలో ఉన్న ఆమె నివాసంలో ఆమె చనిపోయి పడి ఉంది. ఆమె శరీరం కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు గుర్తించారు. ఆమె వయసు 32 ఏళ్ళు మాత్రమే కావడం బాధాకరం. 7 ఏళ్ళ నుండి ఆమె ఇదే అపార్ట్మెంట్లో నివసిస్తుందట.
దాదాపు 7 రోజుల నుండి ఈమె అడుగుజాడలు కనిపించకపోవడం, పైగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారట చుట్టుపక్కల ఉన్నవాళ్లు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుమైరా అస్గర్ అలీ మరణించి ఉండటాన్ని గమనించారు. ఆమె మరణానికి సంబంధించి ఎటువంటి కారణాలు తెలీలేదట. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే తప్ప ఏమీ చెప్పలేమని పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది.