అనుపమ మేజిక్‌తో అప్పుడు.. ఇప్పుడు ఇవానా అదే చేస్తుందా?

‘చెప్పు బుజ్జి కన్నా..’ అంటూ తెలుగు కుర్రాళ్ల గుండెల్ని మెలి తిప్పేసింది ఇవానా. ‘లవ్‌ టుడే’ సినిమాలో ఆమె నటన, క్యూట్‌నెస్‌కి అంతా ఫిదా అయిపోయారు. దీంతో ‘వెంటనే మరో మంచి లవ్‌ స్టోరీలోకి తీసుకోండి బాస్‌’ అంటూ మన డైరెక్టర్లకు రిక్వెస్ట్‌లు కూడా చేసేశారు. అయితే ఓ సినిమా ఓకే అయింది అన్నారు కానీ.. ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు, ఇన్నాళ్లకు ఇవానా కొత్త సినిమా ఓకే అయ్యింది. అంతేకాదు పోస్టర్‌ను కూడా లాంచ్‌ చేసి అనౌన్స్‌ చేసేశారు కూడా.

‘రౌడీ బాయ్స్’ సినిమాతో నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమ్యారు. ఆ సినిమాతో ఆశిష్‌కు మంచి పేరే వచ్చింది. హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఆ సినిమా విజయానికి చాలా పనికొచ్చింది అని చెప్పాలి. ఇప్పుడు రెండో సినిమాగా చేస్తున్న ‘సెల్ఫిష్‌’లో కూడా కీలకమైన హీరోయిన్‌గా ట్రెండింగ్‌ నాయికను ఎంచుకున్నారు. దీంతో సినిమాకు హైప్‌ ఇంకాస్త పెరుగుతుంది అని చెప్పొచ్చు.

విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న సినిమా ‘సెల్ఫిష్’. సినిమా పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ టీమ్‌ ఓ లైన్‌ రాసుకొచ్చింది. ‘‘నా పోరి ‘చైత్ర’ ని రిజర్వేషన్ చేషినా’’ అని పేర్కొంది. ఇంకా మాట బట్టి చూస్తే… పాత బస్తీ నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది. అలాగే ఇవానా మెడలో ఉన్న ఐడీ కార్డు చూస్తే ఆమె ఫైనాన్సియల్ ఎనలిస్ట్ ఉద్యోగం చేస్తున్నట్లు అర్థం అవుతోంది.

పోస్టర్‌లో ఆశిష్ గిరజాల జుట్టు, గడ్డంతో పక్కా మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ‘సెల్ఫిష్’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. పాతబస్తీలోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘ఆర్య’ తర్వాత దిల్‌ రాజు, సుకుమార్‌ కలసి చేస్తున్న సినిమా ఇది. అయితే ఈసారి నిర్మాణం మాత్రమే. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus