Janhvi Kapoor: అప్పుడు సైఫ్‌.. ఇప్పుడు జాన్వీ.. ‘దేవర’కు వాయిదా కష్టాలు.. మరి ముందుకొచ్చి..!

అక్టోబరులో రావాల్సిన సినిమాను సెప్టెంబరుకు ప్రీపోన్‌ చేశారు ‘దేవర’(Devara)  టీమ్‌. అయితే ఇప్పుడు ఆ సినిమా అనుకున్నట్లుగా ఆ తేదీకి వచ్చేస్తుందా? ఇదేం డౌటు అని మీకు అనిపించొచ్చు. అయితే సినిమా షూటింగ్‌ అప్‌డేట్స్‌ వింటుంటే, పరిస్థితులు చూస్తుంటే అలా అనిపించడం లేదు. సినిమాలో కీలక కాస్టింగ్‌ వరుసగా ఏదో కారణంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో విలన్‌ అయిపోగా.. ఇప్పుడు హీరోయిన్‌ అని చెబుతున్నారు.

ఫుడ్ పాయిజనింగ్ కారణంగా జాన్వీ కపూర్‌  (Janhvi Kapoor) ఇప్పుడు ఆసుపత్రిపాలైంది. చికిత్స కోసం ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు తండ్రి బోనీ కపూర్‌ వెల్లడించారు. అయితే పరిస్థితి ఏమంత ఇబ్బందికరంగా లేదని, ఇప్పుడు అంతా ఓకే అని అంటున్నారు. అయితే కొన్ని రోజులు విశ్రాంతి అయితే అవసరం అని చెబుతున్నారు సన్నిహితులు. ఈ నేపథ్యంలో త్వరలో మొదలవుతుంది అన్న ‘దేవర’ కొత్త షెడ్యూల్‌ ఉంటుందా? లేదా? అనేది డౌట్‌గా మారింది.

జాన్వీ కపూర్‌ – ఎన్టీఆర్‌  (Jr NTR)  మధ్య కొంత టాకీ పార్ట్, పాటల చిత్రీకరణ పెండింగ్‌ ఉన్నట్లు సమాచారం. దీని కోసం దర్శకుడు కొరటాల శివ  (Koratala Siva)  షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఉంచారట. మరిప్పుడు ‘ఉల్లఝ్‌’ సినిమా ప్రచారం కూడా ఆగిపోయింది. దీంతో ‘దేవర’ టీమ్‌ డేట్స్‌ మార్చుకోక తప్పదు అని అంటున్నారు. ఈ లెక్కన ‘పుష్ప’కి (Pushpa 2: The Rule)  వచ్చిన సమస్యే ‘దేవర’కు వస్తోంది అంటున్నారు. అదేనండీ వాయిదా సమస్య వస్తుందేమో అంటున్నారు.

‘పుష్ప’ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగిన సంగతి తెలసిందే. సినిమా కీలక సభ్యుల్లో ఒకరు అస్వస్థతకు గురవ్వడంతో షెడ్యూల్స్‌ క్యాన్సిల్‌ చేసి కొత్తగా ఆలోచనలు చేసి త్వరలో ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్‌  (Sukumar) . మరి కొరటాల ఏం చేస్తారో చూడాలి. మరికొందరేమో అక్టోబరులో ఉండుంటే టైమ్‌ సరిపోయేదేమో.. ఇప్పుడు ముందుకొచ్చి సెప్టెంబరులో రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో ప్రీపోన్‌ ఇబ్బందులు వచ్చాయి అంటున్నారు. చూడాలి మరి సినిమా టీమ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus