Jayasudha, Shoban Babu: ఆ హీరో పై మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టిన జయసుధ?

సహజనటిగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన ఎంతో సహజమైన నటనతో అందరిని మెప్పించిన నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుంచి శోభన్ బాబు చిరంజీవి వంటి హీరోలతో కూడా ఈమె కలిసిన నటించారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో ఈమె ఎన్నో అద్భుతమైన తల్లి పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న జయసుధ తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జయసుధ, ఆమని, కుష్బూ, సంఘవి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో సుమ ఎప్పటిలాగే వీరితో కలిసి పెద్ద ఎత్తున సందడి చేశారు.అదేవిధంగా జయసుధ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో తనకు సన్మాన కార్యక్రమం జరిపారు. ఇదిలా ఉండగా ఓ టాస్క్ లో భాగంగా కొందరికి హీరోల ఫోటోలను గీయమంటే హీరోయిన్లు గీసిన ఫోటోలు చూసి సుమ తనదైన శైలిలో కౌంటర్ వేసింది.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శోభన్ బాబు ఫోటో రాగానే వెంటనే జయసుధ ఈ ఫోటో పై స్పందిస్తూ శోభన్ బాబు నా డార్లింగ్ అంటూ మనసులో అతనిపై మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఇక కృష్ణ ఫోటో రావడంతో కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేయలేదని ఆయన మా అంకుల్ అంటూ కామెంట్ చేశారు. అప్పట్లో శోభన్ బాబు జయసుధ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయో మనకు తెలిసిందే.

వెండితెరపై వీరిద్దరి జోడి ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా వీరిని చూసిన ఎంతోమంది అభిమానులు నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారా అనేలా వీరికి కెమిస్ట్రీ అద్భుతంగా పండేదని చెప్పాలి.ఏది ఏమైనా సుమా క్యాష్ కార్యక్రమం ద్వారా శోభన్ బాబు గురించి జయసుధ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus