Jayasudha: షాకింగ్ లుక్లో జయసుధ.. సహజనటిని ఇలా ఎప్పుడైనా చూశారా?
- November 25, 2021 / 12:43 PM ISTByFilmy Focus
చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయసుధ తన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిన తర్వాత భిన్న రకాల పాత్రలను పోషించి జయసుధ అభిమానులకు మరింత చేరువయ్యారు. నటిగా గత 45 సంవత్సరాలుగా జయసుధ సినీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో జయసుధ ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు.
ప్రస్తుతం జయసుధ ఎక్కువగా విదేశాల్లో ఉంటున్నారని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జయసుధ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. జయసుధ ఆరోగ్యం బాగుండటం లేదని వైద్య చికిత్స కోసమే ఆమె విదేశాల్లో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా జయసుధ షేర్ చేసిన ఫోటోను చూస్తే జయసుధ నిజంగానే ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా షేర్ చేసిన ఫోటోలో జయసుధ పీక్కుపోయి కనిపించారు. నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు సైతం జయసుధ ఫోటోను చూసి షాకవుతున్నారు. ట్విట్టర్ లో ఫోటోను షేర్ చేసి ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అని జయసుధ పేర్కొన్నారు. జయసుధ ముఖంలో మునుపటి కళ లేకపోవడంతో పాటు ఆమె ఆరోగ్యం గురించి సమాచారం ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. 2017 సంవత్సరంలో జయసుధ భర్త మృతి చెందారు. జయసుధ అసలు పేరు సుజాత అనే సంగతి తెలిసిందే. గతేడాది జయసుధ కుమారుడు అయిన నిహార్ వివాహం ఘనంగా జరిగింది.
1

2

3

4

5

6

7

8

9

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?











