సహజనటి జయసుధ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికీ ఆమె స్టార్ యాక్ట్రెస్ గా రాణిస్తుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే 1990 నాటి నుండి ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తుంది. ఈమెతో పాటు స్టార్ స్టేటస్ ను అనుభవించిన జయప్రద వంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు దుకాణం సర్దేస్తే ఈమె మాత్రం ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది.
స్టార్ హీరోలకు తల్లి పాత్రలు జయసుధ గారు చేస్తేనే బాగుంటుంది అని ఎంతో మంది భావిస్తుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయ్యింది అంటే.. బాలీవుడ్‌లో శుభాకాంక్షలు తెలిపేవారు. పూల బుకేలు వంటివి పంపించేవారు. కానీ, ఇక్కడ పూల బుకేలు పంపిన వాళ్లు ఎవరూ లేరు.
అదే ఓ హీరో అయితే ఇంకోలా ఉంటుంది. చాలా మంది నాతో అన్నారు ‘ మీరు ఎందుకు పెద్ద పార్టీ ఇచ్చి 50 ఏళ్లు కంప్లీట్ అయ్యింది అని చెప్పడం లేదు’ అని. నాకు అది వద్దు అనిపించింది. ఇండస్ట్రీలో డిస్క్రిమినేషన్ ఉందనేది నా అభిప్రాయం. బాగా సక్సెస్ అయిన హీరోలను ఇక్కడ ఒకలా ట్రీట్ చేయడం. హీరోల కంటే హీరోయిన్లను తక్కువ చేసి చూడటం జరుగుతోంది.నేను టాప్ హీరోయిన్ అయ్యాక కూడా అలాంటివి ఎన్నో చూశాను. ఇప్పటికీ ఉంది.
హీరోల కంటే వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు ఎక్కువ హడావిడి చేస్తారు. కొంతమంది హీరోలు సరిగ్గా డ్యాన్స్ చేయకపోతే.. మమ్మల్ని వచ్చి అడిగేవారు. నేను కానీ, ఎక్కువ డిమాండ్లు పెట్టి, ట్రబుల్ చేసి ఉంటే.. ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండే దాన్ని కాదు. కానీ, ఎక్కడ కావాలో అక్కడ నా గొంతును వినిపించేదాన్ని’’ అంటూ చెప్పుకొచ్చారు జయసుధ.