Jayavani, Venu Madhav: వేణుమాధవ్ ని తన్నేసరికి డైరెక్టర్ షాక్ అయిపోయాడు: జయవాణి!

సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చాలా మంది అనుకుంటారు. నటులుగా, టెక్నీషియన్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి కూడా అలానే ఇండస్ట్రీలోకి వచ్చింది. చదువుకునే సమయంలోనే పెళ్లి చేసేసుకుంది. ఆమె సినిమాల్లోకి రావడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ పెళ్లైన తరువాత భర్త సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో పలు సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. మెల్లగా పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మహాత్మా’ లాంటి సినిమాలు నటిగా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. గయ్యాలి క్యారెక్టర్స్ లో ఆమె బాగా నప్పుతుంది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తాను ఏదైనా క్యారెక్టర్ లో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే అందులో నుంచి త్వరగా బయటకు రాలేనని చెప్పింది. ఒక్కసారి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయితే ఇక చెలరేగిపోతానని చెప్పింది.

గతంలో ఇలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి కమెడియన్ వేణుమాధవ్ ని తన్నానని చెప్పుకొచ్చింది. ”అదిరిందయ్యా చంద్రం’ సినిమాలో వేణుమాధవ్ రోడ్డు మీద తాగి పడిపోతే.. అతడిని లేపి ఇంటికి తీసుకెళ్లే సీన్ ను దర్శకుడు రిహార్సల్స్ చేయించారు. ఆ సీన్ లో కేవలం డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. తీరా కెమెరా ఆన్ చేసి యాక్షన్ అనగానే.. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వేణుమాధవ్ ని కాలితో తన్నుకుంటూ తీసుకెళ్లాను. ఆ షాట్ ఓకే అయిపోయింది.

కానీ డైరెక్టర్ వచ్చి సీన్ లో తన్నడం లేదు కదా.. ఎందుకలా చేశావ్..? ఇప్పుడు వేణుమాధవ్ వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటి..? అని టెన్షన్ పడ్డారు. అదే సమయంలో వేణుమాధవ్ వచ్చి సీన్ చాలా బాగా చేశావ్ అని చెప్పడంతో పరిస్థితి కూల్ అయింది” అంటూ చెప్పుకొచ్చింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus