సినిమా అనే రంగుల ప్రపంచంలో తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఎంతో మంది ఆరాటపడుతుంటారు. తమను తాము వెండితెరపై చూసుకునే క్రమంలో ఎన్నో కష్టాలను వారు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఈ క్యాస్టింగ్ కౌచ్ పై గతంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం మనందరికి తెలిసిందే. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్టు జ్యోతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఓ స్టార్ డైరెక్టర్ తనను చీరపైట విప్పి బెడ్ పై పడుకొమన్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అయితే డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గారు ఈమెకు తొట్టి గ్యాంగ్, ఎవడి గోల వాడిదే వంటి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అయితే ఇవివి సత్యనారాయణ గారు ఎవరికైనా సరే ముందుగా తమ పాత్ర గురించి చెప్పకుండానే షూటింగ్ సెట్ కి రమ్మంటారట. అలాగే జ్యోతిని కూడా ఓ రోజు ఎవడి గోల వాడిదే సినిమా షూటింగ్ సెట్లోకి రమ్మన్నారట.
ఇక అక్కడికి వచ్చాక బెడ్ రూమ్ సీన్ చేయడం కోసం మీద పైట మొత్తం తీసేసి బెడ్ మీద పడుకోమన్నాడట.కానీ ఈ సన్నివేశం చేయడానికి జ్యోతి కి కాస్త మొహమాటం అనిపించిందట. ఈ సీన్ జ్యోతికి నచ్చలేదని తెలిపింది. సెట్లో అందరి ముందు అలాంటి సీన్ చేయడానికి ఆమెకు ఇబ్బందిగా అనిపించిదట. దాంతో డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేసి ఈ సీన్ మర్చమని కోరిందిట. దానికి ఈవీవీ ఒప్పుకోకపోవడంతో.. ఆ సెట్ నుంచి బయటకి వచ్చేసిందట (Actress Jyothi) జ్యోతి.
ఇక అప్పటి నుంచి ఆయన సినిమాలో నటించలేదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జ్యోతి. అయితే జ్యోతి కామెంట్స్ పై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈవీవీ లాంటి గొప్ప డైరెక్టర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అంటే.. చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.