టాలీవుడ్ లో సుధీర్ఘ కాలం కెరీర్ సాగిన హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. దాదాపు ఆమె 13ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. టాప్ హీరోయిన్ గా అందరు స్టార్ హీరోలతో కలిసి నటించిన కాజల్ అనేక బ్లాక్ బస్టర్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేసింది. ఆఫర్స్ పరంగా మునుపటి జోరు లేకున్నప్పటికీ ఆడపా దడపా చిత్రాలు చేస్తుంది. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ఆచార్య మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.
హీరోయిన్ త్రిషా ఈ ప్రాజెక్ట్ నుండి మధ్యలో వెళ్లిపోవడంతో కాజల్ కి ఈ ఆఫర్ దక్కింది. దీనితో పాటు తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు మూవీలో నటిస్తుంది. కెరీర్ ఫేడ్ అవుట్ దశలో ఉండగా ఆమె పెళ్ళికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఆమె పెళ్లిపై ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. కాజల్ కి ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందట. త్వరలోనే ఆమె పెళ్లి కూడా పూర్తి కానుందట. ఎప్పటి నుండో కాజల్ ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి.
కాగా గౌతమ్ అనే ఓ యంగ్ బిజినెస్ మెన్ తో ఆమెకు నిశ్చితార్ధం కూడా ఐపోయిందనేది తాజా వార్తల సారాంశం. కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమమం పూర్తి అయినదని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. అలాగే ఈ పుకార్లపై హీరోయిన్ కాజల్ కూడా స్పందించలేదు . మరి ఆమె మౌనం అంగీకారమా లేదా అనేది తెలియాల్సివుంది.
Most Recommended Video
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?