Kajol: లస్ట్‌కి కాజోల్‌ అర్థం ఏంటంటే..!

కామం అనేది సమాజంలో కొంతమంది జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది, కామం కారణంగానే కొత్త కొత్త బంధాలు ఎలా కలుస్తున్నాయి, పాత బంధాలు ఎలా చెదిరిపోతున్నాయి అనేది లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ లో చూపించారు. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో అడల్ట్ కంటెంట్‌ని ఇష్టపడే వారికి కావాల్సినంత వినోదం లభించనుంది అని తాజాగా విడుదలైన ట్రైలర్‌ని చూస్తే అర్థం అవుతోంది కామం, మోహం, కాంక్ష.. ఇలా లస్ట్‌కి రకరకాల అర్థాలు చెప్పుకుంటారు.

కానీ నా దృష్టిలో లస్ట్‌ అర్థం వేరు అంటూ కొత్త అర్థాన్ని చెప్పారు (Kajol) కాజోల్‌. తాజాగా ఆమె నటించిన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆమెను ‘మీ దృష్టిలో లస్ట్‌ అంటే ఏంటి? అని ఓ విలేకరి అడిగగా.. కాజోల్‌ ఆసక్తికర సమాధానం చెప్పారు. నా ఉద్దేశంలో లస్ట్‌ అంటే విపరీతమైన కోరిక. అది మనకున్న శరీర వాంఛల్లోనే కాదు. ఏ విషయంలోనైనా కావొచ్చు.

నా వరకూ అయితే నా జీవితమే నాకొక పెద్ద లస్ట్‌. ఇష్టమైన ఫుడ్‌ తినడం, డ్యాన్స్‌ చేయడం, సంగీతాన్ని ఆస్వాదించడం, నాకు అలవాటైన కుట్లు, అల్లికలు. ఇవన్నీ నాకు లస్ట్‌తోనే సమాఽనం. పిల్లలితో కలిసి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం కూడా ఆ కోవలోకే వస్తుంది’ అని చెప్పారు కాజోల్‌.

కాజోల్‌, మృణాల్‌ ఠాకూర్‌, తమన్నా, విజయ్‌వర్మ, కుముద్‌ మిశ్రాలాంటి కీలక పాత్రధారులుగా రూపొందిన ఈ సిరీస్‌ ఈ నెల 29న నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. నాలుగు భాగాలుగా వస్తున్న ఈ సిరీస్‌కు అమిత్‌ ఆర్‌ శర్మ, ఆర్‌ బాల్కీ, సుజోయ్‌ ఘోష్‌, కొంకణాసేన్‌ శర్మ దర్శకులు. ఆశిష్‌ దువా, రోనీ స్ర్కూవాలా నిర్మాతలు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus