సెలబ్రిటీలనగానే.. అబ్బో.. కాలు కింద పెట్టరు.. వాళ్ల లైఫ్ స్టయిలే వేరు.. ఆ మెయింటినెన్సే వేరు అనుకుంటూ ఉంటారు.. కానీ తెరమీద కనిపించినట్టు.. అందరూ అనుకుంటున్నట్టేమీ ఉండవ్ సెలబ్రిటీల జీవితాలు.. ఆర్. నారాయణ మూర్తి ఇప్పటికీ ఒకే గదిలో అద్దెకుంటూ.. తెల్లటి దుస్తులు, పాతకాలపు బ్యాగ్, రబ్బర్ చెప్పులతోనే కనిపిస్తారు.. ఎక్కడికి వెళ్లినా ఆటోలోనే ప్రయాణం.. రోడ్ పక్కన హోటల్స్‌లోనే భోజనం చేస్తుంటారు.. ఆయన మొదటి నుండి అంతే కాబట్టి ఆశ్చర్యమేమీ లేదు కానీ..
ఈరోజుల్లో ఓ సీనియర్ నటి సొంత కార్, టీవీ, కనీసం ఏసీ కూడా లేకుండా ఉంది అంటే మాత్రం ఎవ్వరూ నమ్మరు.. ఆమె పరిస్థితి బాగోలేక అంటే అదీ కాదు.. సినిమాలు, సీరియల్స్, వెెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.. ఆమె ఎవరో కాదు.. ఒకప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కథానాయికగా సినిమాలు చేసి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న కస్తూరి శంకర్.. తెలుగులో ‘అన్నమయ్య’ తో గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి.. ‘నిప్పురవ్వ’, ‘ఆకాశ వీధిలో’, ‘మా ఆయన బంగారం’ లాంటి పలు చిత్రాల్లో నటించింది..
ఇటీవల ‘పరంపర’ సిరీసులో బోల్డ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది.. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లోనూ కనిపించింది.. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా కస్తూరి చెన్నైలో మెట్రో ట్రైన్‌లో జర్నీ చేసింది.. ఆ టైంలో ఆమె ఫోన్ పోయింది.. మెట్రో అధికారులకు విషయం చెప్పగా.. వారు వెంటనే వెతికి పెట్టారు.. దీంతో కస్తూరి.. చెన్నై పట్ల, అధికారుల పట్ల మరింత గౌరవం పెరిగిందంటూ ట్వీట్ చేసింది.. ఓ నెటిజన్.. ‘మీకు సొంతగా కార్లుంటాయి కదా.. వాటిలో వెళ్లొచ్చు కదా.. ఇదంతా దేనికి?.. పబ్లిసిటీ కోసమా?.. అని కామెంట్ చేశాడు..
దీనికి కస్తూరి ఇచ్చిన సమాధానం షాకింగ్‌గా అనిపించింది.. ‘నాకు సొంత కార్, టీవీ, ఏసీ లాంటివేవీ లేవు.. నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను’ అని రిప్లై ఇచ్చింది.. మరో నెటిజన్, సంపాదనంతా ఏం చేస్తావ్? అని అడగ్గా.. ‘నేను సంపాదించినదంతా మెడికల్ హెల్ప్, చైల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను’ అని క్లారిటీ ఇచ్చింది.. దీంతో ఇండస్ట్రీ వారు, నెటిజన్లు కస్తూరి హెల్పింగ్ నేచర్, సాధారణ జీవితం గడపడం గురించి ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు..
I don’t own a car.
I don’t have tv.
I don’t use Air conditioning.
I practice a simpler lifestyle. https://t.co/bl4NJ6ecNt