నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఓ పొలిటికల్ ఈవెంట్ కు హాజరైంది కస్తూరి (Kasthuri Shankar) . ఈ క్రమంలో ఆమె స్పీచ్ ఇస్తూ తెలుగు వాళ్లని అవమానిస్తూ కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో అంతఃపురంలో ఉండే మహిళలకు సేవ చేసేందుకు రాజులు వచ్చారు, అలాగే తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు, పక్కనోళ్ళ పెళ్ళాల పై మోజు పడొద్దు’ అంటూ ఇష్టమొచ్చిన కామెంట్లు చేసింది. దీంతో తెలుగు సంఘాలు వాటిని వ్యతిరేకించి కేసులు పెట్టడం జరిగింది.
ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా రెడీ అయ్యా రు అని తెలుసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఫైనల్ గా ఆమె శనివారం హైదరాబాద్‌లో ఉన్నట్టు సైబర్ క్రైం పోలీసుల ద్వారా తీసుకుని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది.తర్వాత ఆమెను చైన్నె పుళల్ జైలుకి తరలించారు. తర్వాత ఆమె ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకోగా ఆమె సింగిల్ మదర్, స్పెషల్‌చైల్డ్ ఉండటం, ఆమెను కస్తూరే చూసుకోవాల్సి ఉండటంతో షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారట.
కస్తూరికి వివాదాలు కొత్తేమీ కాదు. తమిళంలో ఆమెపై చాలా కేసులు ఉన్నాయి. అందువల్ల అక్కడి సినిమాల్లోకి ఆమెను ఎక్కువగా తీసుకోరు. అందుకే ‘గృహలక్ష్మి’ వంటి సీరియల్స్ తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్ తో ఈమెను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం వల్ల.. ఇక్కడి వెబ్ సిరీస్..లలో , సినిమాల్లో తీసుకుంటున్నారు మేకర్స్. ఆ విశ్వాసం కూడా లేకుండా కస్తూరి తెలుగు వాళ్ళ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం అనేది నిజంగా బాధాకరం అనే చెప్పాలి.