Kasthuri: ‘ఆదిపురుష్’ పై కస్తూరి విమర్శలు.. ‘నువ్వు మాత్రం తల్లిలా కనిపిస్తున్నావా?’ అంటూ..!

ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ ఏడాది వస్తున్న మొదటి పెద్ద సినిమా ఇది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఆల్రెడీ రూ.300 కోట్లు బిజినెస్ చేసింది. ట్రైలర్, పాటలు, ఫైనల్ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచాయి. ప్రభాస్ హిందీలో చేసిన మొదటి స్ట్రైట్ మూవీ ఇది. అందుకే ప్రభాస్ తప్ప సినిమాలో నటించిన వాళ్లంతా బాలీవుడ్ వాళ్ళే.

మొదట ‘ఆదిపురుష్’ పై విపరీతమైన నెగిటివిటీ ఉండేది. టీజర్ చూశాక చాలా మంది ఘోరంగా ట్రోల్ చేశారు. హనుమంతుడి లుక్ పై కూడా వివాదాలు నెలకొన్నాయి. కొంతమంది ఈ సినిమా పై కేసులు వేస్తామని కూడా మీడియా ముందుకు వచ్చి హడావిడి చేశారు. అయితే ట్రైలర్, పాటలకి మంచి స్పందన లభించాక జనాలు వాటిని పట్టించుకోలేదు. ఏది ఏమైనా ఆదిపురుష్ పై ఏదో ఒక విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

మొన్నటికి మొన్న ‘ఆదిపురుష్’ దర్శకుడు హీరోయిన్ కృతి సనన్ కి తిరుమల శ్రీవారి ఆలయం ముందు ముద్దులు పెట్టడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం పై చాలా మంది ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మరోపక్క తాజాగా నటి కస్తూరి.. ‘ఆదిపురుష్’ పై నెగిటివ్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ‘ఆదిపురుష్’ పై స్పందిస్తూ.. “టాలీవుడ్లో ఎంతో మంది నటులు శ్రీరాముని పాత్రలో అద్భుతంగా కనిపించరు.

కానీ ప్రభాస్ మాత్రం రాముడిగా కాకుండా కర్ణుడిలా కనిపిస్తున్నాడు’ అంటూ విమర్శలు గుప్పించింది. ఆమె కామెంట్లపై4 కొంతమంది అనుకూలంగా స్పందిస్తుంటే.. మరికొంతమంది మాత్రం.. ‘నువ్వు మాత్రం తల్లి పాత్రకి సెట్ అయ్యావా.. మేము చూడటం లేదు. నువ్వు కూడా అలాంటి పాత్రకి సెట్ అవ్వవు’ అంటూ నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ‘గృహలక్ష్మీ’ సీరియల్లో కస్తూరి తల్లి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆమె (Kasthuri) పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus