Kausalya: ఆ కారణంతోనే నటి కౌశల్య పెళ్లి చేసుకోలేదట..!

ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించి ప్రస్తుతం సహాయనటిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి కౌసల్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తాను ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు. పెళ్లిపై తనకు సదుద్దేశమే ఉందన్నారు. అయితే, పెళ్లి చేసుకోకపోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయన్నారు. ‘‘పెళ్లి అనే అంశంపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు వైవాహిక బంధం తప్పకుండా అందంగా ఉంటుంది. పెళ్లిపై నాకు ఎన్నో ఆలోచనలు ఉండేవి.

పెళ్లి అనే విషయానికి నేను సెట్‌ కానని మొదట్లో అనుకునేదాన్ని. నాకు సరైన వ్యక్తి దొరకడేమో అని భయపడేదాన్ని. ఓ దశలో సరైన బంధం కోసం ఎదురుచూశా. కానీ, అది నాకు సెట్‌ కాలేదు. తల్లిదండ్రులతోనే ఉండాలని నిర్ణయించుకున్నా. వాళ్లతో నాకు మంచి అనుబంధం ఉంది. అదే సమయంలో పెళ్లైతే అత్తమామలతో ఎలా ఉంటానోనని కంగారుపడ్డా. ఇలాంటి ఆలోచనలతో రిలేషన్‌, పెళ్లి అనే విషయాలకు కొంతకాలం పాటు దూరంగా ఉన్నా. కొన్నేళ్ల క్రితం నేను అనారోగ్యానికి గురయ్యా.

బరువు బాగా పెరిగాను. అప్పట్లో నేను నటించిన కొన్ని సినిమాలు సరైన సంతృప్తిని అందించలేదు. దాంతో అన్నింటి నుంచి బ్రేక్‌ తీసుకున్నా. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా’’ అని ఆమె చెప్పారు. కర్ణాటకకు చెందిన కౌసల్య.. ‘ఏప్రిల్‌ 19’ అనే మలయాళీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమిళం, మలయాళంతోపాటు తెలుగులోనూ ఆమె నటించారు.

‘అల్లుడుగారు వచ్చారు’, ‘పంచదార చిలక’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కౌసల్య హీరోయిన్‌గానే కాకుండా సహాయనటిగానూ పలు చిత్రాల్లో కనిపించారు. ‘గౌరి’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘హీరో’ చిత్రాల్లో ఆమె (Kausalya) కీలకపాత్రలు పోషించారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus