Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి.. ఆహ్వానం కొందరికేనా?

సౌత్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తటిల్‌తో ఏడాడుగులు వేయబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ లో గోవాలో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు కేవలం కొందరు ముఖ్యమైన సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి కీర్తి సురేష్ కూడా అధికారికంగా ప్రకటించి, తాను జీవితంలో కొత్త అధ్యాయానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు.

Keerthy Suresh

వివాహం గోవాలో ఓ ప్రముఖ రిసార్ట్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కీర్తి కుటుంబం ఈ వేడుకను ప్రైవేట్ ఈవెంట్‌గా మార్చాలని నిర్ణయించుకుంది. టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , నేచురల్ స్టార్ నాని ఈ పెళ్లికి ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కీర్తి తల్లి మేనకతో మంచి స్నేహం కలిగి ఉండటంతో ఈ ఆహ్వానం అందుకున్నారని చెప్పుకుంటున్నారు. నాని (Nani) , కీర్తి సురేష్ కలిసి నటించిన “నేను లోకల్” (Nenu Local) , “దసరా” (Dasara) సినిమాల వల్ల వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

కోలీవుడ్ నుంచి కూడా అట్లీ (Atlee Kumar) , దళపతి విజయ్ (Vijay Thalapathy) వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. కీర్తి, విజయ్ “సర్కార్” (Sarkar) సినిమాలో కలిసి నటించడంతో ఈ స్నేహం ఏర్పడింది. ఇక కీర్తి తాజాగా వరుణ్ ధావన్‌తో (Varun Dhawan) కలిసి నటించిన “బేబీ జాన్”  (Baby John) డిసెంబర్ 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో మంచి విజయం సాధించాలని చూస్తోంది. ఇదిలా ఉంటే, కీర్తి తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టింది.

“రివాల్వర్ రీటా” సినిమాతో అంచనాలు పెంచుతున్న ఆమె, “బేబీ జాన్” సినిమా సక్సెస్‌తో తన సినీ ప్రయాణాన్ని మరో రేంజ్ కు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మొత్తం మీద, కీర్తి పెళ్లి వేడుక ఎంతో ప్రత్యేకంగా జరగనుండగా, దీనికి సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు అభిమానుల మధ్య చర్చనీయాంశమవుతోంది. మరి ఆమెకి ఎలాంటి విజయాలు అందుతాయో చూడాలి.

పుష్ప-2 హైప్.. బన్నీ శ్రమ ఫలిస్తోంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus