Allu Arjun: పుష్ప-2 హైప్.. బన్నీ శ్రమ ఫలిస్తోంది!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  ప్రస్తుతానికి సినిమా ప్రమోషన్స్‌లో పూర్తిగా డిజీగా ఉన్నారు. ‘పుష్ప 2: ది రూల్'(Pushpa 2: The Rule)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న బన్నీ, సీక్వెల్ కోసం మూడు సంవత్సరాలు కష్టపడి, తన పూర్తి సమయాన్ని ఈ ప్రాజెక్ట్‌కి కేటాయించారు. షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ తన దృష్టిని ప్రమోషన్స్ పై మళ్లించారు, అందులోనూ పాన్ ఇండియా స్థాయిలో. డిసెంబర్ 5న విడుదల కానున్న ‘పుష్ప 2’ పై ప్రేక్షకులు, ట్రేడ్ సర్కిల్స్ భారీ అంచనాలు పెట్టుకున్నాయి.

Allu Arjun

మరింత క్రేజ్ పెంచేందుకు బన్నీ పాన్ ఇండియా ప్రమోషన్ టూర్ చేస్తున్నాడు. పాట్నా, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈవెంట్స్‌లో పాల్గొంటూ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నారు. ఆయన ప్రతి ఈవెంట్‌లో ఫ్యాన్స్ నుండి విపరీతమైన ఆదరణ పొందుతున్నారు. ఇది ‘పుష్ప 2’ హైప్‌ను మరింత పెంచుతోంది. అయితే బన్నీ చేస్తున్న ఈ ప్రమోషన్స్ పద్ధతి ఇప్పుడు టాలీవుడ్‌లోనే చర్చనీయాంశంగా మారింది. ఒక్కో సిటీలో అభిమానులతో కలిసే విధానం, మీడియా ఇంటరాక్షన్స్, ప్రీ-రిజీజ్ ఈవెంట్స్‌ నిర్వహణతో ఆయన సినిమా మీద మరింత ఆసక్తి రేపుతున్నారు.

ఈ విధానం చూసి, ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలు కూడా ఇలాగే చేయాలని కోరుకుంటున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. నాన్ తెలుగు రాష్ట్రాల్లోనూ అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ ప్రమోషన్స్ స్పష్టంగా చూపుతున్నాయి. ‘పుష్ప 1’ (Pushpa) హిట్ తరువాత, బన్నీకి పాన్ ఇండియా ఫాలోయింగ్ పెరగడంతో, ఆయన ఇప్పటివరకు ఈ స్థాయిలో అడుగు పెట్టని ప్రాంతాల్లో కూడా భారీ ఆదరణ పొందుతున్నారు.

ఇది సినిమా కలెక్షన్స్‌పై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. బన్నీలా ఇతర హీరోలు కూడా తమ సినిమాల కోసం ఈ విధంగా ముందుకొస్తే, టాలీవుడ్‌ మరింత పెద్ద స్థాయిలో ఎదగగలదు. ఈ ప్రమోషన్ టెక్నిక్‌తో అల్లు అర్జున్ మరోసారి తన డెడికేషన్‌ను నిరూపించుకున్నారు.

నటుడు సుబ్బరాజు భార్య గురించి ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus