Krithi Shetty: కృతికి మనసైన పాత్రలు ఏంటో తెలుసా? లిస్ట్‌ పెద్దదే!

20 ఏళ్ల వయసులో ఓ హీరోయిన్‌ని ‘ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?’ అని అడిగితే.. ఏ రొమాంటిక్‌ సినిమానో, ఏ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ సినిమానో చేయాలని ఉంది అని చెబుతారు. దానికితోడు వాళ్ల యంగ్‌ లుక్‌, ఫిజిక్‌కి అవి బాగా నప్పుతాయి కూడా. అయితే ఓ హీరోయిన్‌ మాత్రం చాలా పెద్ద సినిమాలు చేయాలని అనుకుంటోంది. ఆ హీరోయినే బేబమ్మ అలియాస్‌ కృతి శెట్టి (Krithi Shetty)  . ఇక చేయాలనుకుంటున్న సినిమా జేజమ్మది.

చాలా రోజుల తర్వాత తెలుగులోకి ‘మనమే’ (Manamey)  సినిమాతో వస్తోంది కృతి శెట్టి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘బాహుబలి’ (Baahubali) సినిమాలో అనుష్కలా (Anushka) కనిపించాలని ఉంది అని చెప్పింది కృతి. రాకుమారి పాత్రలంటే తనకు చాలా ఇష్టమని అందుకే జేజమ్మ తరహా పాత్రలు అని చెబుతోంది. అంతేకాదు అవకాశం వస్తే యాక్షన్, మార్షల్‌ ఆర్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తా అని చెబుతోంది.

ఇక ఎలాంటి పాత్రలు చేయాలని నుంది అనే విషయాన్ని కొనసాగిస్తూ.. పాత్ర పరిధి ఎంత అనే విషయం కంటే, ఎంత వైవిధ్యంగా ఉంది అనే విషయాన్ని చూస్తా అని చెప్పింది. అంతేకాదు ‘ఉప్పెన’ (Uppena) సినిమా తర్వాత ‘శ్యామ్‌ సింగరాయ్‌’ (Shyam Singha Roy) సినిమాలో చిన్న పాత్ర చేయడానికి అదే కారణం అని చెప్పింది. ఇప్పటికీ సినిమా సినిమాకీ వైవిధ్యాన్నే కోరుకుంటాను అని అంటుఓంది. అయితే చేసిన పాత్రల్నే మళ్లీ మళ్లీ చేయడం మాత్రం తనకు నచ్చదట.

ఇక సోషల్‌ మీడియాలో మీపై వస్తున్న కామెంట్ల గురించి ఏమంటారు? అని అడిగితే.. ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకోను అని అనను. ఎందుకంటే నేను ఉన్న పరిశ్రమ అలాంటిది అంటోంది. అయితే మరీ ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే బాధపడతా అని చెప్పింది. కాకపోతే ఇప్పటివరకూ ఎవరూ అంత దారుణంగా కామెంట్‌ చేయలేదు అని అంటోంది కృతి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus