Kriti Sanon,Prabhas: రాఘవ పాత్రకు ప్రభాస్ తప్ప ఎవరు న్యాయం చేయలేరు:కృతి సనన్

ప్రభాస్ కృతి సనన్ జంటగా బాలీవుడ్ దర్శకుడు ఓం రైతు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా నటికృతి సీతమ్మ పాత్రలో కనిపిస్తోంది ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 16వ తేదీన స్థాయిలో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో డివోషనల్ సిటీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకనుఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది అభిమానులు చేరుకున్నారు. అలాగే చిత్ర బృందం కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఈ వేడుకలో నటి కృతి సనన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా కృతి మాట్లాడుతూ ఆది పురుష్ సినిమాలో నటించే అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు సినిమా ద్వారా తాను ఇండస్ట్రీకి పరిచయమయ్యానని అయితే తొమ్మిది సంవత్సరాల తర్వాత తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇలాంటి ఒక గొప్ప సినిమా ద్వారా రాబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇక జానకి పాత్రలో నటించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానని ఈమె తెలియజేశారు.

ఈ విధంగా కృతి (Kriti Sanon) సినిమా గురించి మాట్లాడుతూ ఉండగా యాంకర్ ప్రదీప్ ప్రభాస్ గురించి కూడా మాట్లాడమని చెప్పగా ప్రభాస్ స్వీట్ అండ్ కైండ్ పర్సన్ అని తెలియజేశారు. మీరందరూ ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉంటారని తక్కువగా మాట్లాడుతారని అనుకుంటారు కానీ మీరు అనుకున్నట్టు ప్రభాస్ సైలెంట్ కాదని ఆయన చాలా బాగా మాట్లాడుతారు అంటూ కృతి తెలిపారు. ఈ సినిమాలో రాఘవుడి పాత్రలో ప్రభాస్ తప్ప మరెవరు చేసిన ఈ పాత్రకు న్యాయం చేయలేరు అంటూ ఈ సందర్భంగా కృతి సనన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus