Kushboo: 32 ఏళ్లు పూర్తి చేసుకున్న కుష్బూ చిన్ని తంబి… ఎమోషనల్ అయిన నటి!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో గుర్తింపు పొందిన సీనియర్ నటి కుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్న ఖుష్బూ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన మొదటి సినిమాను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

1991 వ సంవత్సరంలో హీరోయిన్గా ఈమె మొదటిగా నటుడు ప్రభుతో కలిసి చిన్న తంబి అనే సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలై 32 సంవత్సరాలు కావడంతో కుష్బూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా ఈమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… చిన్న తంబి సినిమా చేసి అప్పుడే 32 సంవత్సరాలు అయ్యింది అంటే నమ్మలేకపోతున్నాను.. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

ఇక వాసు ప్రభువు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది.ఇక ఈ సినిమాకు హృదయాలను కదిలించే సంగీతాన్ని అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గారికి,కే బాలు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాలో నందిని పాత్రలో నటించిన ఆమె నందిని ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక కుష్బూ (Kushboo) నటుడు ప్రభువుని 1993 సెప్టెంబర్ 12వ తేదీ వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికి ప్రభుకి పెళ్లి కావడంతో వీరిపెళ్లిని శివాజీ గణేషన్ అంగీకరించకపోవడంతో పెళ్లైన నాలుగు నెలలకే కుష్బూ విడాకులు తీసుకుని తిరిగి డైరెక్టర్ సుందర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus