Laila: డైరెక్టర్ కాళ్లపై పడి క్షమాపణలు కోరాను: లైలా

లైలా పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి లైలా ఎంతో చిన్న పిల్లల ఎప్పుడు అల్లరి చేస్తూ చలాకీగా ఉండే అమ్మాయిలాగే కనపడుతూ ఉంటారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. ఈ విధంగా ప్రముఖ వ్యాపారవేత్తతో ఘనంగా వివాహం జరుపుకున్నటువంటి లైలా కొంతకాలపాటు సినిమాలకు దూరమై గోవాలో స్థిరపడ్డారు.

ప్రస్తుతం ఈమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి లైలా తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ నటించిన సర్దార్ సినిమా ద్వారా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా లైలా మాట్లాడుతూ కోలీవుడ్ స్టార్ హీరో బాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా లైలా (Laila) మాట్లాడుతూ… 2001లో నందా అనే సినిమా చేస్తున్నాం. అప్పటికీ నాకింకా తమిళం రాదు. డైలాగ్ లు తప్పుగా చెప్పేదాన్ని. ఇలా డైలాగ్ చెప్పడం రాకపోవడంతో బాలా సార్ నన్ను ఎప్పుడు తిడుతూ ఉండేవారు. ఇలా ఆయన తరచూ నాపై కోపడటంతో ఇకపై ఆయన సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాను కాకపోతే బాల సార్ గురించి అందరూ చాలా మంచిగా చెప్పడంతో కాస్త ఓపికగా ఉన్నాను.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలైన రోజు థియేటర్లో వెళ్లి సినిమా చూశాను అక్కడ థియేటర్లో ప్రేక్షకులు చేస్తున్నటువంటి గోల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నేనేనా ఇంత అద్భుతంగా నటించానని అనిపించిందని తెలిపారు. ఇక సినిమా చూసిన వెంటనే బాల సార్ దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లపై పడి క్షమాపణలు కోరాను అంటూ ఈ సందర్భంగా లైలా డైరెక్టర్ బాల గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus