Laya: చీరకట్టులో డ్యాన్స్ అదరగొట్టిన నటి లయ.. వైరల్ అవుతున్నఫోటోలు, వీడియోలు..

నటి లయ.. చూడగానే తెలుగుదనం, తెలుగు సంప్రదాయం ఆమె ముఖంలో తొణికిసలాడుతుంటుంది. చేసిన సినిమాలన్నిటిలోనూ పక్కింటమ్మాయి తరహా పాత్రలే కాకుండా నటనకు ఆస్కారమున్న క్యారెక్టర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ప్రేమించు’, ‘మనోహరం’ చిత్రాలకు నంది అవార్డులందుకుంది.. హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉండగానే అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్ శ్రీ గణేష్‌ను పెళ్లి చేసుకుంది విజయవాడ అమ్మాయి లయ. పెళ్లి తర్వాత భర్తతో పాటు అక్కడే స్థిర పడిపోయింది. వీరికి ఓ పాప, బాబు సంతానం.

రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తనలానే పిల్లలిద్దర్నీ బాలనటులుగా పరిచయం చేస్తూ.. తను కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.. సినిమాలకు, తెలుగు వాళ్లకు దూరంగా ఉంటున్నా కానీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందరికీ ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. ఫ్యామిలీ పిక్స్, తన ఫోటోషూట్స్, లేటెస్ట్ రీల్స్‌తో సందడి చేస్తుంటుంది. రీసెంట్‌గా చీరకట్టులో.. కె.విశ్వనాథ్ ‘స్వరాభిషేకం’ లోని ‘నీ చెంతే ఒక చెంచిత ఉంటే’ అనే బ్యూటిఫుల్ సాంగ్‌తో పాటు..

విక్రమ్, ఆర్య నటించిన తమిళ్ మూవీ ‘ఎనిమీ’ లోని పాటకు కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది. లయ పిక్స్, డ్యాన్స్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..


రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus