Mahalakshmi: ఘనంగా భర్త పుట్టినరోజు వేడుకలను జరిపిన నటి మహాలక్ష్మి!

కోలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర నటిగా ఎంతో మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మహాలక్ష్మి పలు సినిమాలలో కూడా నటించారు. అయితే ఈమె ప్రముఖ నిర్మాత అయినటువంటి రవీందర్ చంద్రశేఖరన్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇలా వీరిద్దరు వివాహ సమయంలో వీరి గురించి ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. భారీ శరీర ఖాయం కలిగినటువంటి రవీందర్ ను మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో కేవలం ఆయన డబ్బు చూసి మాత్రమే ఈమె పెళ్లి చేసుకున్నారు అంటూ భారీగా విమర్శలు చేశారు.

అదేవిధంగా రవీందర్ చంద్రశేఖర్ పై బాడీ షేమింగ్ ట్రోల్స్ కూడా చేశారు.అయితే ఇద్దరికీ ఇది రెండవ వివాహం కావడంతో వీరి గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ వినిపించాయి కానీ ఇవేవీ వారు పట్టించుకోకుండా తామిద్దరం ప్రేమించి ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నామని ఇలాంటి వాటిని తాము పట్టించుకోమంటూ కొట్టి పారేశారు.ఇక వీరి వివాహం జరిగి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

ఇకపోతే మహాలక్ష్మి (Mahalakshmi) తన భర్త రవీందర్ చంద్రశేఖరన్ పుట్టినరోజు కావడంతో తన భర్త పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరిపించారు. అంతేకాకుండా తన భర్తకు పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే ఆరడుగుల కానుకను ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మహాలక్ష్మి తన భర్త రవీందర్ కు ఎలాంటి బహుమతి ఇచ్చారు ఏంటి అనే విషయానికి వస్తే… ఆరడుగులు ఎత్తు ఉన్నటువంటి రవీందర్ ఫోటోను చక్కని పెయింటింగ్ తో తయారుచేసి ఆయనకు బహుమతిగా ఇచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… జీవితంలో నాకు మరీ ధైర్యం తెచ్చిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు…మీరే నా బలం అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞరాలిని అంటూ ఈ సందర్భంగా ఈమె తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ నిర్మాత రవీందర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus