హనీమూన్ ట్రిప్ పై భారీ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

కోలీవుడ్ లో నిర్మాతగా పాపులర్ అయిన రవీందర్ బుల్లితెర నటి విజే మహాలక్ష్మీ ప్రేమించుకొని ఇటీవల బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావటంతో ఈ విషయం వైరల్ గా మారింది. అంతే రవీంద్ర చాలా లావుగా ఉండటం వల్ల వీరి పెళ్ళి వార్త కోలీవుడ్ లో మాత్రమే కాకుంటే టాలివుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

అంతే కాకుండా వీధి జోడి పట్ల నెటిజన్స్ నుండి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వివాహాం తర్వాత వీరికి సంబందించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ కుల దైవాన్ని కూడా దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల ఈ నవ దంపతులిద్దరూ హనీమూన్ కి చెక్కేశారు.

వీరిద్దరు హనీమూన్ కోసం ప్రైవేట్ ఫ్లైట్ లో సెంట్రల్ అమెరికాలోని బెలిజ్ సిటీకి చేరుకుని అక్కడ ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ తీసుకున్న ఫోటోతో పాటు హోటల్లో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ హనీమూన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్స్ వీరిని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మహాలక్ష్మి స్పందిస్తూ..దయచేసి మా గురించి తప్పుగా మాట్లాడకండి అని వేడుకుంది. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా కూడా వీరిద్దరూ తమ హనీమూన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

1

2

3

4

More..

1

2

3

4

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus