మహేశ్వరి అంటే… శ్రీదేవి చెల్లెలు అనే తెలుసు. చాలామంది ఇలానే అనుకుంటూ ఉంటారు. ఆమె కూడా బయటెప్పుడైనా శ్రీదేవితో కనిపించినప్పుడు అలానే అక్కడ అని పిలిచేది. అయితే మహేశ్వరికి శ్రీదేవి సోదరి కాదని మీకు తెలుసు. కొంతమందికి మాత్రం అసలు విషయం తెలుసు. అయితే వాళ్లంతా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు అయి ఉంటారు. అసలు విషయం ఏంటంటే… శ్రీదేవికి మహేశ్వరి కూతురు వరుస అవుతుందట. ఈ విషయం మహేశ్వరినే చెప్పింది. అంతేకాదు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పింది.
మహేశ్వరి ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో చాలా కామ్‌గా ఉండేవారట. డైరక్టర్ కట్ చెబితే… సెట్‌లో ఓ మూలకు వెళ్లి కూర్చునేవారట. అయితే ‘‘శ్రీదేవి ఫ్యామిలీ నుండి వచ్చింది కదా అందుకే పొగరు’’ అని అనుకునేవారట. ఒక్కోసారి ఆమెకు వినిపించేలానే అనేవారట. అయితే తాను తక్కువగా మాట్లాడతానని, అందుకే అలా సెట్‌లో ఉండే దాన్ని అని చెప్పారు మహేశ్వరి. తన పని తాను చేసుకుంటూ ఓ మూలకు రామా కృష్ణ అని కూర్చుంటే తనను అలా అనేవారు అని చెప్పింది మహేశ్వరి.
ఇక తనకు పిన్ని అయ్యే శ్రీదేవి గురించి కూడా మహేశ్వరి మాట్లాడారు. శ్రీదేవి తనుకు పిన్ని అవుతారని, కానీ అక్క అని పిలిచేదాన్నని, పప్పక్క, పప్పక్క అని పిలిచి అదే అలవాటు అయిపోయిందని చెప్పుకొచ్చారు మహేశ్వరి. అలాంటి శ్రీదేవి లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మబుద్ధి కావడంలేదన్నారు. ఇప్పటికీ ఆమె ఏదో అబ్రాడ్‌లో షూటింగ్ చేస్తున్నారని అనుకుంటూ ఉంటామని చెప్పారు మహేశ్వరి. మహేశ్వరి కెరీర్‌లో భారీ విజయం అంటే… ‘పెళ్ళి’ సినిమానే.
ఆ సమయంలో హీరో వడ్డే నవీన్‌తో సరదా సంఘటన గురించి కూడా చెప్పారు మహేశ్వరి. సినిమా సెట్స్‌లో ఆమె, నవీన్ ఎడమొహం పెడమొహంలా ఉండేవారట. అస్సలు మాటలే ఉండేవి కావట. ఆ తర్వాత ఇద్దరూ కలసి ‘మా బాలాజీ’లో నటించారు. అయితే ఆ సినిమాలో మహేశ్వరి పాత్ర మూగమ్మాయి. మా మధ్య మాటలు లేకపోవడానికి, ఆ సినిమాలో పాత్రకు సరిపోయింది అంటూ నవ్వుకున్నారామె.దీంతోపాటు ‘గులాబీ’ సినిమా గురించి కూడా చెప్పారు.
ఆ సినిమా అంత భారీ విజయం దక్కించుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ఆ సినిమా సమయంలో రామ్‌గోపాల్ వర్మ చెప్పడం వల్ల కృష్ణవంశీ ఆమెతో డబ్బింగ్ చెప్పించారట. ఆ వాయిస్‌కి అప్పట్లో ఫ్యాన్స్ మామూలుగా ఉండేవారు కాదు. ఇక ఆ సినిమాలోని ‘మేఘాలలో తేలిపోమ్మనది’ పాట షూటింగ్ సమయంలో జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా చెప్పారు మహేశ్వరి. ఎదురుగా వెహికల్ రావడంతో బండి లోయలోకి వెళ్లిపోయింది. కొంచెంలో పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పారు మహేశ్వరి.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!