Actress: క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన నటి మాళవిక శ్రీనాథ్!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరంగంలోనూ మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు మహిళలను ఎంతగానో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.ఇలా కాస్టింగ్ కౌచ్ అన్ని రంగాలలో ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం కాస్త ఎక్కువగా వినపడుతుంటుంది.ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలని తప్పనిసరిగా కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందని ఎంతో మంది సెలబ్రిటీలు ఇదివరకే తెలియచేశారు. ఇకపోతే కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అన్నది పూర్తిగా మన చేతులలోనే ఉంటుందని పలువురు ఈ విషయం గురించి బహిరంగంగా తెలియజేశారు.

ఇక మరికొందరు తాము కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలియజేశారు. తాజాగా నటి (Actress) మాళవిక శ్రీనాథ్ సైతం తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని తెలియజేశారు. సరిగ్గా ఈ ఘటన మూడు సంవత్సరాల క్రితం జరిగిందని ఈమె గుర్తు చేసుకున్నారు. మంజు వారియర్ కూతురి పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతుండగా తాను కూడా తన అమ్మ, సోదరితో కలిసి ఆడిషన్స్ కి వెళ్ళాననీ తెలిపారు ఇక సినిమా ఇండస్ట్రీ వారు మా ఇంటికి కారు పంపించారని కారులో ఒక బిల్డింగ్ లో ఆడిషన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళామని తెలిపారు.

అయితే మేమందరం బయట ఎదురు చూస్తూ ఉండగా ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి జుట్టు సరిగా లేదు మేకప్ రూమ్ లోకి వెళ్లి జుట్టు సరి చేసుకోండి అని నాకు చెప్పారు. జుట్టు సరిగా లేకపోవడంతో సరి చేసుకోవడం కోసం నేను లోపలికి వెళ్ళాను అయితే ఆ వ్యక్తి తనతో పాటు లోపలికి వచ్చి తనని ఎంతో అసభ్యంగా తాకారని తెలిపారు.

తాను బయటికి వెళ్లాలని ప్రయత్నం చేస్తుండగా ఒక్క పది నిమిషాలు కో-ఆపరేట్ చేస్తే ఈ పాత్ర మీకే వస్తుందని తనని బలవంతం చేయబోయారని తాను అక్కడి నుంచి తప్పించుకొని ఏడుస్తూ బయటికి వెళ్లిపోయానని ఈ సందర్భంగా తనకు జరిగినటువంటి చేదు సంఘటన గురించి ఈ సందర్భంగా మాళవిక శ్రీనాథ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus