Malvi Malhotra: ‘తిరగబడరాసామీ’ లో తన బోల్డ్ సీన్స్ పై స్పందించిన హీరోయిన్ మాల్వి మల్హోత్రా.!

రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా సీనియర్ దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి (AS Ravikumar Chowdhary) ‘తిరగబడరాసామీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తుంది. రాజ్ తరుణ్ తో ముద్దులు, బెడ్ రూమ్ సీన్స్ లో ఓ రేంజ్లో రెచ్చిపోయి నటించింది.

ఈమె లుక్స్ కూడా బాగున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఈమె… ముంబై లో చదువుకుంది. థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొందింది. హిందీలో పలు సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ సినిమాల్లో నటించింది. మలయాళం,తమిళ సినిమాల్లో కూడా నటించింది. ‘తిరగబడరాసామీ’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్స్ లో హీరో రాజ్ తరుణ్ తో ఈమె బోల్డ్ సీన్స్ గురించి ప్రస్తావన వచ్చింది.

దీనిపై ఈమె స్పందిస్తూ.. ‘సినిమా కథలో భాగంగా లిప్ లాక్ సీన్స్,లవ్ మేకింగ్ సీన్స్ ఉన్నాయి.మొదట్లో ఆ సీన్స్ చేయడానికి టెన్షన్ వచ్చింది. కానీ హీరో రాజ్ తరుణ్ నన్ను అర్థం చేసుకుని .. నాకు నా స్పేస్ ఇచ్చారు. వాటి గురించి చెబితే కథలో మెయిన్ ట్విస్ట్ కూడా కూడా రివీల్ అయిపోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus