Malvika Sharma: టాలీవుడ్ బ్యూటీ.. లాయర్ గా సెటిల్ అవుతుందా..?

చాలా మంది నటీనటులు చదువును పక్కన పెట్టేసి ఇండస్ట్రీకి వస్తుంటారు. ఇక్కడ సెటిల్ అయ్యాక చదువు మీద ఇంట్రెస్ట్ ని పక్కన పెట్టేస్తారు. కానీ కొందరు కొంత సమయాన్ని కేటాయించి చదువును పూర్తి చేస్తుంటారు. కొందరు ఏకంగా నటనను పక్కన పెట్టి మరీ చదువు వైపు అడుగులు వేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు సినిమాలు వదిలేసి అమెరికా వెళ్లి ఎంబీఏ చేసి అక్కడే ఉద్యోగంలో చేరింది. తరువాత అక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకొని సెట్ల్ అయిపొయింది.

ఇప్పుడు మరో హీరోయిన్ కూడా చదువుని పూర్తి చేసి జాబ్ చేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. మాళవిక శర్మ. ‘నేలటికెట్టు’, ‘రెడ్’ లాంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ సైలెంట్ గా ‘ఎల్ ఎల్ బీ’ను పూర్తి చేసిందట. ముంబైలో రిజ్వి లా కాలేజీ నుండి ఆమె గత నవంబర్ లో లా డిగ్రీ తీసుకుందట. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోని హైకోర్టులో జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిందట. జనవరిలోనే ఆమెకి మహారాష్ట్ర బార్ కౌన్సిల్ నుండి లా ప్రాక్టీస్ కోసం లైసెన్స్ కూడా వచ్చిందట.

అది వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్ లో ఈ బ్యూటీ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నటిగా మాళవికకి సరైన బ్రేక్ రావడం లేదు. ‘నేల టికెట్టు’ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ‘రెడ్’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినప్పటికీ టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఛాన్స్ లు రాకపోవడంతో లా ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై అవకాశాలు రాకపోతే గనుక లాయర్ గా సెటిల్ అయిపోతుందేమో చూడాలి!

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus