Meena: 57 ఏళ్ళ వ్యక్తిని మీనా రెండో పెళ్లి చేసుకోబోతోందా.. క్లారిటీ ఇదిగో..!

సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లకు జోడీగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పటికీ ‘దృశ్యం'(సిరీస్) వంటి సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ముఖ్యంగా లంగ్స్ సంబంధిత అనారోగ్యంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే.

విద్యా సాగర్ బెంగళూరుకు చెందిన ఓ పెద్ద బిజినెస్ మెన్. ఇక భర్త మరణంతో మీనా మరియు ఆమె ఫ్యామిలీ విషాదంలో కూరుకుపోయారు.ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం మీనా పలు సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. మీనాకి నైనిక అనే కూతురు ఉంది. ఇదిలా ఉండగా.. మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇప్పుడు కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు మీనా వయస్సు 46 ఏళ్లు.

దీంతో తనకు అలాగే తన కూతురికి తోడు కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారట.మీనాకి మరో పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే మీనా భర్త విద్యాసాగర్ కి దగ్గర బంధువు, సన్నిహితుడు అయిన ఓ వ్యక్తిని మీనా పెళ్లి చేసుకోవాలి అని మీనా కుటుంబ సభ్యులు కోరుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అతని వయస్సు 57 సంవత్సరాలు ఉంటాయి అని వినికిడి.

అయితే ఈ వార్తల పై మీనా సన్నిహిత వర్గం స్పందించింది. అవన్నీ వట్టి గాసిప్స్ మాత్రమే అని .. వారెవ్వరూ కూడా మీనా గారిని రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదని తెలియజేశారు. ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాల షూటింగ్ లను కంప్లీట్ చేయాల్సి ఉందని.. వాటి గురించి తప్ప వేరే వాటి గురించి ఆమె ఆలోచించడం లేదని వారు చెప్పుకొచ్చారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus