Mehreen: హీరోయిన్‌కి విచిత్రమైన కష్టం… క్లారిటీ ఇచ్చినా ఆగట్లేదుగా?

  • October 19, 2023 / 02:28 PM IST

హీరోయిన్‌ అన్నాక అన్ని రకాల సినిమాలు చేయాలి, అన్ని రకాల సన్నివేశాల్లోనూ నటించాలి అని అంటుంటారు. అయితే వేటిలో నటించాలి అనేది మాత్రం వాళ్ల ఇష్టమే. ఈ క్రమంలో హాట్‌ సన్నివేశాలు కూడా ఉంటాయి. అలా ఇటీవల హాట్‌ బోల్డ్‌ సీన్స్‌లో నటించి మెప్పించే ప్రయత్నం చేసింది హనీ.. అదేనండీ మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదా. థియేటర్ల నుండి ఓటీటీలకు వస్తున్న కథానాయికలు అనే కాన్సెప్ట్‌లో ఆమె కూడా ఓటీటీలోకి ఓ వెబ్‌ సిరీస్‌తో వచ్చేసింది. అదే ‘సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ’.

ఈ సిరీస్‌లో ఆమె హాట్‌ సీన్స్‌లో కనిపించింది అంటూ కొన్ని కామెంట్స్‌ వచ్చాయి. ఈ విషయంలో మెహ్రీన్‌ ఆసక్తికర రిప్లై ఇచ్చింది. అంతేకాదు ఆ సన్నివేశం మీరు అనుకునేది కాదని, అది వేరు అంటూ క్లారిటీ ఇచ్చింది. శృంగార సన్నివేశాల్లో నటించడం వృత్తిలో భాగమని చెప్పిన మెహ్రీన్‌… ఆ సిరీస్‌లో వైవాహిక అత్యాచారాని చూపించారని, అవి శృంగార సన్నివేశాలుగా చూడటం సరికాదని చెప్పుకొచ్చింది. దిల్లీ సుల్తాన్‌ క్రూరమైన వైవాహిక అత్యాచారాన్ని చూపించే ఆ సీన్‌ను చాలా మంది ఒక శృంగార సన్నివేశం అనడం బాధాకరం అని అంది.

ప్రపంచంలో చాలా మంది మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ విషయాన్ని చూపించే ప్రయత్నం సిరీస్‌లో చేశారు. అయితే దీని గురించి ట్రోల్ చేయడం బాధపెట్టింది. ఆ సన్నివేశాల గురించి అలా మాట్లాడే వాళ్లకు అక్కా చెల్లెళ్లు, కుమార్తెలు ఉంటారు కదా అంటూ కాస్త కటువుగా మాట్లాడింది. అంతేకాదు వాళ్లకు అలాంటి బాధ ఎదురుకాకూడదు అని కోరుకుంది. ఆ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో నటీనటులకు అసౌకర్యం కలగకుండా చిత్రబృందం చాలా కష్టపడుతుంది. ఆ కష్టాన్ని నీరుగార్చేలా ఎవరూ మాట్లాడకూడదు అని కూడా చెప్పింది.

‘కృష్ణ గాడి వీర‌ ప్రేమ‌గాథ’ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌య‌మైన మెహరీన్‌ అనతికాలంలో యువ హీరోలకు ఫేవరెట్‌ నాయి అయిపోయింది. అలా ‘మహానుభావుడు’, ‘కేరాఫ్‌ సూర్య’, ‘పంతం’, ‘జవాన్‌’, ‘నోటా’, ‘కవచం’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’, ‘ఎంత మంచి వాడవురా’, ‘అశ్వద్ధామ’, ‘మంచి రోజులొచ్చాయ్‌’ లాంటి సినిమాలతో అలరించింది. అయితే ఇప్పుడు ఆమె (Mehreen) చేతిలో పెద్దగా సినిమాలు లేవు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus