Namitha: ఆ విషయంలో కొన్ని సంవత్సరాలు నరకం అనుభవించాను: నమిత

కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమై తర్వాత కాలంలో కనిపించకుండా పోతారు సడన్ గా సోషల్ మీడియాలో దర్శనమిస్తారు అలాంటి హీరోయిన్ జాబితాలో ఇప్పుడు నమిత చేరింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సొంతం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన నమిత తొలి సినిమానే హిట్ కావడంతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకున్నారు.నమిత నటించిన జెమినీ, బిల్లా, సింహా సినిమాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. కెరీర్ మొదట్లో సన్నగా కనిపించిన నమిత ఆ తరువాత సినిమాల్లో లావుగా కనిపించారు.

లావుగా ఉండటం వల్ల ఆమె లుక్ పై కొన్ని విమర్శలు వచ్చినా ఆమె ఆ విమర్శల గురించి అప్పట్లో స్పందించలేదు. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నమిత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.తాను మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడం గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ ను పెడుతున్నానని.

పది సంవత్సరాల క్రితం (Namitha) తాను బొద్దుగా ఉండేదానినని.అలా ఉండటం వల్ల తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యానని ఆమె అన్నారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొవడంపై అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పోస్ట్ పెడుతున్నాను అంటూ సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. సుమారు తొమ్మిది, పదేళ్ల క్రితం బొద్దుగా ఉండేదాన్ని. అప్పట్లో మానసిక కుంగుబాటుకు లోనయ్యాను.

ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నాననే విషయం కూడా నాకు తెలియలేదు. రాత్రిళ్లు నిద్రపోయేదాన్ని కాదు. ఈ క్రమంలో ఎక్కువగా ఆహారం తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా విపరీతంగా బరువు పెరిగిపోయాను. చూస్తుండగానే నా బరువు 97 కిలోలకు చేరింది. మద్యం తాగడం వల్లే నేను బరువు పెరిగానని అనుకుంటూ ఉంటారు కానీ అసలు విషయం వేరే ఉంది అని చెప్పుకొచ్చింది నమిత.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus