ఆ ఘటన నుంచి బయటకు రాలేకపోతున్నా.. నటి వ్యాఖ్యలు!

షూటింగ్ కోసం రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లిన బాలీవుడ్ నటి నిఖిత రావల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు తనను తుపాకీతో బెదిరించి రూ.7 లక్షలు విలువ చేసే ఆభరణాలను దొంగిలించినట్లు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాలను చెప్పుకొచ్చారు. ఢిల్లీలో షూటింగ్ ఉండడంతో అక్కడే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని.. ఒక్కదాన్నే ఉండేదాన్ని అని తెలిపింది.

ఓరోజు షూటింగ్ ముగిశాక రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా.. తన ఇంటి సమీపంలోకి రాగానే ఓ ఇన్నోవా కారు వేగంగా తనవైపు వచ్చి ఆగిందని.. వెంటనే కారులో నుంచి ముసుగు వేసుకొని ఉన్న నలుగురు వ్యక్తులు దిగారని చెప్పింది. అందులో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకొని తన తలకు గురిపెట్టి తన వద్ద ఉన్న విలువైన వస్తువులను ఇవ్వమని బెదిరించినట్లు చెప్పింది. ఆ సమయంలో తన ఒంటిపై ఉన్న బంగారు ఉంగరం, చెవి కమ్మలు, వాచ్, డైమండ్ పెండెంట్, డబ్బులను లాక్కెళ్లారని వివరించింది.

వారిని చూడగానే మైండ్ బ్లాక్ అయిందని.. పది నిమిషాల పాటు ఏం జరుగుతుందో అర్ధం కాలేదని.. ఈ ఘటన జరగగానే.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని భయపడుతూ గడిపానని చెప్పారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. దీని నుంచి బయటపడలేకపోతున్నానని.. ఇంకా బతికే ఉన్నానా..? అని ఆశ్చర్యం కలుగుతుందని చెప్పింది. ఒకవేళ ఆరోజు తనను దుండగులు హత్య చేసినా.. లైంగిక దాడికి పాల్పడినా.. నా పరిస్థితి ఏమై ఉండేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus