Pavala Syamala: ఆరోగ్యం క్షీణించి.. దీన స్థితిలో ఉన్న హాస్యనటి శ్యామల..!

‘సుస్వాగతం’ ‘మనసంతా నువ్వే’ ‘వర్షం’ ‘ఖడ్గం’ ‘ఆంధ్రావాలా’ ‘గోలీమార్’ వంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న నటి పావలా శ్యామల. ముఖ్యంగా ‘గోలీమార్’ సినిమాలో ఈమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు.ఆ చిత్రంలో ఓ పక్క సీరియస్ గా మాట్లాడుతూనే.. కామెడీ పండించడం విశేషం. అండర్ వరల్డ్ మాఫియా డాన్ ని లెక్క లేనట్టుగా మాట్లాడి విసిగిస్తుంది. ఈ ఎపిసోడ్ కు థియేటర్లో ప్రేక్షకులు ఎగబడి నవ్వారు. అంతేకాకుండా ‘ఆంధ్రావాలా’ సినిమాలో ఈమె బ్రహ్మానందం ను విసిగిస్తూ చేసే కామెడీ కూడా క్లిక్ అయ్యింది. ఇప్పటికీ ఆ ఎపిసోడ్ పై మీమ్స్ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.అంతేకాకుండా ఈమె ఆరోగ్యం కూడా క్షీణించినట్టు సమాచారం. దాంతో ‘బిగ్ బాస్ 4’ కంటెస్టెంట్ అయిన కరాటే కళ్యాణి ఈమెకు కొంత ఆర్థిక సాయం చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక శ్యామల ఈ విషయం పై మాట్లాడుతూ.. ‘నేను స్టేజి ఆర్టిస్ట్‌గా 30 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నాను.నాకు ఎన్నో సన్మానాలు, సత్కారాలు వరించాయి.అయితే ఇప్పుడు అనారోగ్యం కారణంగా సినీ పరిశ్రమకు దూరమయ్యాను. కొన్నాళ్లుగా నేను నా కూతురు ఇద్దరం కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాం. నా ఆర్థిక సమస్యలు తెలిసి.. మెగాస్టార్‌ చిరంజీవి గారు రూ.2 లక్షలు సాయం చేశారు.

‘గబ్బర్‌సింగ్‌’ సినిమా టైములో పవన్‌ కళ్యాణ్ గారు కూడా నాకు సాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం వారు నాకు నెలకు రూ.10 వేల చొప్పున ఫించన్‌ ఇచ్చేవారు. అయితే మూడు నెలల నుండీ అది కూడా రావడం లేదు. ఇప్పుడు ఇల్లు గడవడం చాలా కష్టంగా మారింది. నాకు వచ్చిన అవార్డులు కొన్ని అమ్మేసి.. ఆ డబ్బుతో ఇంటి అద్దె కట్టుకుంటూ వచ్చాను’’ అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఈ నేపథ్యంలో శ్యామలకు సాయం చెయ్యడానికి ‘మా'(మూవీ ఆర్ట్స్ అసోసియేషన్) ముందుకు వచ్చింది. ఇంకా అనేకమంది ముందుకు వచ్చి ఆమెకు సాయం చెయ్యాలని కరాటే కళ్యాణి కూడా వేడుకుంది.


టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus