ఆ విషయం పై క్లారిటీ ఇచ్చేసిన నటి పవిత్ర..!

పవిత్ర లోకేష్..ఈమె గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. తెలుగు సినిమాల్లో ఈమె ఎక్కువగా తల్లి పాత్రల్లో కనిపిస్తుంటుంది. రవితేజ హీరోగా నటించిన ‘దొంగోడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పవిత్ర.. ఇప్పటి వరకూ 43 తెలుగు సినిమాల్లో నటించింది.ఈమె కన్నడ పరిశ్రమకు చెందిన నటే అయినప్పటికీ.. తెలుగింటి ఆడపడుచులానే కనిపిస్తుంటుంది.అందుకే తెలుగు ప్రేక్షకులకు చాలా తొందరగా కనెక్ట్ అయిపోయింది పవిత్ర. అయితే పేరుకి తగ్గట్టే ఇప్పటి వరకూ సినిమాల్లో చాలా పద్దతిగా కనిపిస్తూ వచ్చిన పవిత్ర… ఇటీవల విడుదలైన ‘రెడ్’ సినిమాలో మాత్రం బోల్డ్ పాత్రలో దర్శనమిచ్చి అందరినీ షాక్ కు గురి చేసింది.

అవును ‘రెడ్’ చిత్రంలో ఈమెది నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర. ఈ చిత్రంలో స్మోకింగ్ సీన్లలో కూడా నటించింది ఈ 42 ఏళ్ళ బ్యూటీ. దాంతో రియల్ లైఫ్లో కూడా పవిత్ర లోకేష్ ఇంతే బోల్డ్ గా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది నటీమణులు సినిమాల్లో పద్దతిగా కనిపించినప్పటికీ.. బయట చాలా మోడరన్ గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా వారి సోషల్ మీడియా ఖాతాల్లో గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేసి.. హడావిడి చేస్తుంటారు.

అందుకే పవిత్ర గురించి కూడా అలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం పై తాజాగా పవిత్ర స్పందించింది. ‘నిజ జీవితంలో నేను స్మోకింగ్ చెయ్యను. దానికి నేను చాలా దూరంగా ఉంటాను. ‘రెడ్’ సినిమాలో కేవలం పాత్ర డిమాండ్ చెయ్యడం వల్లే అలాంటి సన్నివేశాల్లో నటించాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus