ఈ మధ్య కాలంలో ప్రముఖ టాలీవుడ్ నటి పవిత్ర లోకేశ్ పేరు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ పార్థివదేహం దగ్గర నరేష్, పవిత్ర కలిసి కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు నరేష్, పవిత్ర గురించి తప్పుగా కథనాలను ప్రసారం చేశాయి. వైరల్ అయిన కథనాలు తన పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉండటంతో పవిత్ర లోకేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు తమ గురించి తప్పుగా ప్రచారం చేశాయని ఆమె పేర్కొన్నారు.కొంతమంది తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నాయని పవిత్ర లోకేశ్ ఫిర్యాదులో వెల్లడించారు. ట్రోల్స్ శృతి మించడం వల్లే పవిత్ర లోకేశ్ ఈ దిశగా అడుగులు వేశారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ తన గురించి ఇష్టానుసారం మాట్లాడటం ఆమెను హర్ట్ చేసిందని పోలీసులు వెల్లడించారు.
తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసే విధంగా ట్రోల్స్ ఉండటం వల్లే పవిత్ర లోకేశ్ ఓపిక నశించి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. పవిత్ర లోకేశ్ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. భవిష్యత్తులో తన గురించి తప్పుగా ప్రచారం జరగకూడదని భావించి పవిత్ర లోకేశ్ ఈ పని చేశారని తెలుస్తోంది. కృష్ణ మరణం తర్వాత పవిత్ర పరువుకు భంగం కలిగేలా కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి.
పవిత్ర లోకేశ్ ఫిర్యాదుపై పోలీసులు విచారణ మొదలుపెట్టారని త్వరలోనే నిందితులను పట్టుకోనున్నారని తెలుస్తోంది. ఇష్టానుసారం థంబ్ నైల్స్ తో తన గురించి జరుగుతున్న ప్రచారం ఆగాలని పవిత్ర లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే పవిత్ర లోకేశ్ ఫిర్యాదు విషయంలో కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు.