Payal Ghosh: ప్రతి క్షణం భయంతో బతుకుతున్నా.. నటి కామెంట్స్!

గుర్తు తెలియని వ్యక్తులు తనపై యాసిడ్ దాడికి ప్రయత్నించారని నటి పాయల్ ఘోష్ తెలిపారు. చేతికి గాయాలపాలైన ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ తను ఎదుర్కొన్న సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందులు తీసుకువద్దామని చాలా రోజుల తరువాత బయటకు వెళ్లానని.. పనులన్నీ పూర్తి చేసుకొని కారు ఎక్కుతుండగా.. కొందరు మాస్క్ వేసుకొని ఉన్న వ్యక్తులు తనపై దాడి చేసినట్లు చెప్పింది. ఆ సమయంలో తన చేతికి స్వల్ప గాయాలయ్యాయని..

వాళ్ల చేతుల్లో యాసిడ్ బాటిల్స్ ఉన్నాయని చెప్పింది. వాటిని చూసిన వెంటనే సాయం కోరుతూ గట్టిగా కేకలు వేశానని.. దాంతో వాళ్లు అక్కడి పారిపోయానని.. ఆ సంఘటన తరువాత ప్రతి క్షణం భయమేస్తుందని చెప్పుకొచ్చింది. దాన్ని తలచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉందని పాయల్ వివరించింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. తెలుగులో ‘ప్రయాణం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది.

ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో పాయల్ కి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో బాలీవుడ్ లో ‘పటేల్ కీ పంజాబీ షాదీ’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఆమెకి నిరాశే ఎదురైంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus