తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు దగ్గర ఉంగుటూరు గ్రామానికి చెందిన ఈయనకు ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో.. ‘మేము సీబీఐ నుండీ కాల్ చేస్తున్నాం. మేం అడిగినంత మొత్తం ఇస్తే మీ మీద ఉన్న కేసులన్నీ మాఫీ చేస్తాం అంటూ ఓ లేడీ మాట్లాడింది. అయితే ఆమె మాటలకు మొదట రాయపాటి కంగారు పడినా..
తరువాత అనుమానం రావడంతో.. ఆయనే సి.బి.ఐ వారికి కాల్ చేసి కన్ఫార్మ్ చేసుకున్నాడు. దాంతో తనకు కాల్ చేసిన వ్యక్తి నకిలీ అని గ్రహించి.. వెంటనే ఆమె పై సీబీఐ వారికి ఫిర్యాదు చేశాడు. రాయపాటి ఇచ్చిన ఫిర్యాదు ని స్వీకరించిన సీబీఐ వారు.. ఆ నెంబర్ కు ఫోన్ చేసి.. ‘రాయపాటికి ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి ఎవరో కనిపెట్టేసారు. ఆమె ‘మరెవరో కాదు మలయాళ నటి లీనా మోరియాపాల్’ అని ఖరారు చేసుకున్నారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
అయితే ఈ వ్యవహారం వెలుగులోకి రాకముందే లీనా హైకోర్టు నుండీ ముందస్తు బెయిల్ తెచ్చుకుని జాగ్రత్త పడింది. అప్పట్లో కూడా లీనా కేరళలో ఓ బ్యాంకును మోసం చేసి మొత్తం 19 కోట్ల వరకూ నొక్కేసిందని తెలుస్తుంది. ఆ కారణంగానే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ‘జైలుకి వెళ్ళి వచ్చినా.. ఈమె ఇంకా మారలేదని’ కొందరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లీనా.. రాయపాటి విషయంలో మరోసారి జైలుకి వెళ్ళడం తప్పదనే చెప్పాలి.
Most Recommended Video
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!