పూజా హెగ్డే ఈ ఏడాది నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. బయ్యర్స్ పెట్టినదానికి రెండింతలు ఈ చిత్రం కలెక్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే. టాక్ తో సంబంధం లేకుండా అవి వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ‘దువ్వాడ జగన్నాథం’ ‘అరవింద సమేత’ ‘మహర్షి’ వంటి చిత్రాలతో పాటు బాలీవుడ్లో పూజ నటించిన ‘హౌస్ ఫుల్ 4’ చిత్రం కూడా భారీగా కలెక్ట్ చేసింది.
దాంతో ఈ బ్యూటీకి తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఈమె పారితోషికం కూడా డబుల్ చేసిందని వినికిడి. ఇప్పటి వరకూ కోటిన్నర వరకూ తీసుకుంటూ వచ్చిన పూజ, ఇప్పడు తన వద్దకు వస్తోన్న దర్శక నిర్మాతలకు రూ.2.5కోట్ల నుండీ రూ.3కోట్ల వరకూ చెప్తుందట. దాంతో ఆ దర్శకనిర్మాతలు కూడా బెంబేలెత్తిపోతున్నట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది.
షూటింగ్ దశలో ఉన్న సినిమాలకు ఇంట్రెస్ట్ లు కట్టడం కోసం.. ప్రస్తుతం వారి దగ్గర రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలను ఓటిటిలకు ఇచ్చేస్తున్నారు.ఈ పరిస్థితిని అర్ధం చేసుకుని ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు పారితోషికాలు తగ్గించుకుంటున్నారు. మరి పూజ ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకుందో..!