Pooja Hegde: ఫలితం ఎలా ఉన్నా అనుభవించాల్సిందే

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూజ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. ఇలా అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. పూజ హెగ్డే నటించిన సినిమాలలో ఎక్కువ శాతం ప్లాప్ అయినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం తగ్గటం లేదు.

ఇటీవల పూజ నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవటంతో తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక హిందీలో కూడా ఇటీవల పూజ నటించిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తన కెరీర్ గురించి మాట్లాడుతూ “జీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలి.. చేసేది ఏమీ లేదు.

మనం చేసే పని , తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉనా.. ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదు అంటూ వేదాంతం వల్లించింది. ఇలా పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవటమే కాకుండా ఈ అమ్మడు డేట్స్ ఇచ్చిన సినిమాలు కూడా డిలే అవటంతో ఈ అమ్మడి పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న జనగణమన సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో జనగణమన సినిమా షూటింగ్ కి కూడా బ్రేకులు పడ్డాయి.

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న ‘భగవతీయుడు భగత్ సింగ్ ‘సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే ప్రస్తుతం రాజకీయ పనులతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమా కోసం కేటాయించిన డేట్స్ ని పూజ తన ఫ్యామిలీ వెకేషన్స్ కి వాడుకుంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో మాత్రమే నటిస్తోంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus